Google Trend Funny King Cobra Video: పాములను చూడగానే చాలామంది గజగజా వణికి పోతూ ఉంటారు. పాము ఏదైనా మన చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉంటే దానిని వెతికి మరి కొట్టి చంపుతూ ఉంటారు. అయితే ప్రస్తుతం చాలామంది స్నేక్ క్యాచర్స్ వాటిని రక్షించాలని ఆసక్తితో జనావాసాల్లో సంచారం చేసే పాములను పట్టి అడవి ప్రాంతాల్లో వదిలేస్తున్నారు. పాములు పట్టే క్రమంలో తీసిన వీడియోలను చాలామంది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇవి అనుకోకుండా తెగ వైరల్ అవుతున్నాయి. ఇటీవలే ఓ నెటిజన్ షేర్ చేసిన పాము కు సంబంధించిన వీడియో ఇప్పుడు అందర్నీ నవ్వు పుట్టించే విధంగా చేస్తుంది. ఇంతకీ ఆ వీడియో ఏంటి? పామంటే భయం ఉన్నవారు ఈ వీడియోను చూసి ఎందుకు నవ్వుతున్నారో? వీటన్నిటి ప్రశ్నలకు మనం ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం అడవులలో నీరు, ఆహారం కోరత కారణంగా అనేక జంతువులు అడవి నుంచి జనావాసాల్లోకి సంచారం చేస్తున్నాయి. ముఖ్యంగా పాములైతే లెక్కకు మించి జనావాసాల్లోకి వస్తున్నాయి. అయితే ఇటీవలే ఓ పల్లె ప్రాంతంలో జరిగిన పాముకు సంబంధించిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో వివరాల ప్రకారం.. కింగ్ కోబ్రా నేరుగా ఓ ఇంట్లోకి దూసుకు రావడం మీరు గమనించవచ్చు. ఇంతలోనే ఓ మహిళ ఆ పామును గమనించి కేకలు వేయడం ప్రారంభిస్తుంది. అయినప్పటికీ ఆ పాము ఎంతో స్పీడుగా దూసుకు వస్తుంది. అయితే ఆ మహిళ ఏమీ చేయలేక తన చెప్పులను పాము పైకి విసురుతుంది. 





మహిళ కేకలు వేస్తూ పాము పైకి తన ఒక చెప్పును విసురుతుంది. అయితే ఆ పాము ఆ చెప్పును నోట్లో పెట్టుకొని ఎంతో స్పీడ్ గా చెట్లలోకి దూరడం మీరు గమనించవచ్చు. ప్రస్తుతం పాము చేసిన వింత చేష్టలు సోషల్ మీడియా వినియోగదారులకు నవ్వు పుట్టిస్తున్నాయి. ప్రస్తుతం పాములకు సంబంధించిన చాలా రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికీ..ఇలాంటి నవ్వు పుట్టించే వీడియో మొదటిసారిగా వైరల్ అవుతోంది. 


Also read: Corona New Variant: భయపెడుతున్న కరోనా కొత్త వేరియంట్, కేరళ, తెలంగాణలో పెరుగుతున్న కేసులు


అంతేకాకుండా చాలామంది నెటిజన్స్ వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు. పాము చెప్పుల దొంగగా మారింది అంటూ కొంతమంది కామెంట్ చేస్తే..మరి కొంత మంది పాము చెప్పును నోటితో ఎత్తుకుపోవడం మొదటిసారి చూస్తున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాదారుడు షేర్ చేశాడు. ఇప్పటికీ ఈ వీడియోను 9 మిలియన్లకు పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించగా 2.5 లక్షల మంది లైక్ చేశారు.


Also read: Corona New Variant: భయపెడుతున్న కరోనా కొత్త వేరియంట్, కేరళ, తెలంగాణలో పెరుగుతున్న కేసులు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter