అక్కడ ఇద్దరు రాజకీయ నాయకులు ఉన్నారు. చిన్నపాటి రాజకీయ నాయకులు అంటే ఏమో అనొచ్చు కానీ అక్కడుంది..  దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మరొకరు కేంద్ర స్వయంప్రతిపత్తి హోదా మంత్రి గిరిరాజ్ సింగ్. వీరిద్దరికీ డెస్క్ మీద ఉన్న ఘోర పొరపాటు కనపడలేదేమో..! ఏకంగా ట్విట్టర్ లో కూడా పోస్ట్ చేశారు. ఆతరువాత నాలుకర్చుకొని డిలీట్ చేశారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీరిద్దరూ అధికారిక పర్యటన నిమిత్తం మారిష‌స్ కు వెళ్లారు. అక్కడ జరుగుతున్న వ్యవహారాలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ వచ్చారు. అయితే ఒక పోస్ట్ మాత్రం వైరల్ గా మారిపోయింది. ఇందులో డెస్క్ మీద కూర్చుని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌ ఏదో ఫైలుపై సంతకం పెడుతున్నారు. పక్కనే సీఎం యోగి నిల్చున్నారు. ఇతర అధికారులు కూడా ఉన్నారు. అయితే ఆ ఫొటోలో ఉన్న త‌ప్పిదాన్ని నెటిజ‌న్లు వెంట‌నే గుర్తించారు. డెస్క్ మీద ఉన్న భార‌త జాతీయ ప‌తాకం బొమ్మ తిర‌గ‌బ‌డి ఉండ‌టాన్ని నెటిజన్లు గుర్తించి, వెంటనే  త‌మ‌కు న‌చ్చిన విధంగా వ్యంగంగా కామెంట్లు చేశారు. జరిగిన తప్పిదాన్ని గుర్తించిన సీఎం వెంటనే ఆ పోస్ట్ ను డిలీట్ చేశారు.అప్పటికే ఈ ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ అయిపొయింది.