German Shepherd Dog Guarding Bodies: సాహసయాత్రకు వెళ్లిన యజమానులు లోయలో పడి చనిపోయారు. వారి ఆచూకీ రెండు రోజులైనా లభించలేదు. వారి ఆచూకీ లభించక కుటుంబసభ్యులు అల్లాడుతుంటే వారి పెంపుడు కుక్క మాత్రం వారి జాడను కనిపెట్టేలా చేసింది. కుటుంబసభ్యులు, పోలీసులు కలిసి గాలిస్తుండగా ఆ శునకం ద్వారా మృతులను గుర్తించారు. లోయలో పడి చనిపోయిన యజమానుల వద్ద ఆ శునకం రెండు రోజులుగా అలాగే నిలబడి ఉండిపోయింది. వారి దేహాలను చూస్తూ కొన్ని గంటలసేపు మౌనంగా అలానే ఉండిపోయింది. ఈ దృశ్యాలు అందరినీ ఆవేదనకు గురి చేశాయి. కుక్కలకు విశ్వాసం మెండుగా ఉంటుందని మరోసారి నిరూపితమైంది. ఈ సంఘటన మనదేశంలోనే జరిగింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Cockroach Vande Bharat: భోజనంలో బొద్దింక.. 'వందే భారత్‌' ప్రయాణికుడికి విస్తుగొల్పే ఘటన


మహారాష్ట్రలోని పుణెకు చెందిన ప్రణీత వాలా (26) తన స్నేహితులతో కలిసి హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లా బిర్‌ బిల్లింగ్‌లో పర్యటించింది. అక్కడ ఫిబ్రవరి 6వ తేదీన ట్రెక్కింగ్‌, పారా గ్లైడింగ్‌ చేస్తున్నారు. సాయంత్రం కాగానే వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రణీతతో వచ్చిన మిగతా వారు వెనక్కి వచ్చారు. అయితే పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌కు చెందిన అభినందన్‌ గుప్తా (30) స్థానికంగా నాలుగేళ్లుగా ఉంటున్నాడు. ట్రెక్కింగ్‌, పారా గ్లైడింగ్‌ శిక్షణ ఇస్తున్నాడు.

Also Read: Fish Load Lorry: రోడ్డుపై విలవిలలాడిన చేపలు.. జాలి లేకుండా వాటిపైనే వెళ్లిన వాహనాలు


వారికి గైడింగ్‌ చేస్తున్న అభినందన్‌ గుప్తా మిగతా వారు వెళ్లడంతో ప్రణీతను సురక్షితంగా తీసుకెళ్తానని చెప్పి వెంట తీసుకెళ్లాడు. అభినందన్‌ తన పెంపుడు కుక్కతో కలిసి ముగ్గురు మంచు ప్రదేశ అందాలను చూసేందుకు ముందుకువెళ్లారు. ఎత్తయిన కొండ ప్రాంతంలో మంచు తీవ్రంగా ఉంది. మంచు ప్రభావంతో కొండలపై వారిద్దరూ జారిపడిపోయారు. లోయప్రాంతంలో పడిపోయారు. వాతావరణ ప్రభావంతో వారి ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్‌ అయ్యాయి.


వారి సమాచారం తెలియక కుటుంబసభ్యులు ఆందోళన చెందుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 48 గంటలైనా వారి ఆచూకీ లభించలేదు. స్థానిక పోలీసులు రెస్క్యూ బృందాలతో కలిసి గాలించారు. కొండప్రాంతాల్లో ప్రణీత, అభినందన్‌ గుప్తాల మృతదేహాల వద్ద జెర్మన్‌ షెఫర్డ్‌ కుక్క అలాగే వేచి ఉంది. పోలీసులు గాలిస్తున్న క్రమంలో కుక్క భౌ భౌ అని అరవడంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పరిశీలించగా ప్రణీత, అభినందన్‌ అచేతనావస్థలో కూరుకునిపోయి ఉన్నారు. చలి తీవ్రతకు వారి ప్రాణం పోయింది. వారి ఆచూకీ లభిచడంలో కుక్క పాత్ర మరువలేనిది. లేకపోతే కొన్నాళ్లయితే మంచులోనే ఆ మృతదేహాలు మునిగిపోయేవి. కుక్క చూపిన విశ్వాసం, నిజాయతీతో పోలీసులు, కుటుంబసభ్యులు నివ్వెరపోయారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook