Today's Google trending videos: తిరుమల స్థానిక బాలాజీ నగర్‌లో 12 అడుగుల భారీ కొండచిలువ హల్చల్ చేసింది. తిరుమలలో మధ్యాహ్నం నుంచి ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. ఈ క్రమంలోనే తిరుమలలోని బాలాజీనగర్లోకి ఓ భారీ కొండ చిలువ ఎంట్రీ ఇచ్చి అందరినీ హడలెత్తించింది. బాలాజీ నగర్ ప్రాంత వాసులు ఈ కొండ చిలువను గుర్తించి స్నేక్ క్యాచర్ కి సమాచారం అందించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు ధైర్యం చేసి ఆ భారీ కొండచిలువను పట్టుకున్నారు. పట్టుకునే సమయంలో కొండచిలువ చాలాసేపు ప్రతిఘటించడంతో స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడుకి తన పని పూర్తి చేయడం ఒకింత కత్తిమీద సాములానే మారింది. అయినప్పటికీ ఎలాగోలా ధైర్యం చేసి ఆ కొండచిలువను పట్టుకుని బంధించాడు. అనంతరం దట్టమైన అడవిలో వదిలేసారు. 


సాధారణంగా కొండచిలువలు వస్తుంటాయి కానీ ఇంత భారీ సైజ్ కొండచిలువను ఈ ప్రాంతంలో చూడటం తక్కువ అని భాస్కర్ నాయుడు చెప్పుకొచ్చాడు. కొండ చిలువ 12 అడుగుల పొడవు ఉంది. ఎవరికీ ఎలాంటి హాని జరగకుండా కొండచిలువను బంధించి అడవిలో విడిచిపెట్టడంతో స్థానికులు సైతం హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. 


సరైన సమయంలో స్థానికులు సమాచారం అందివ్వడం, వెంటనే టీటీడీ స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు అక్కడికి చేరుకుని కొండచిలువను బంధించడంతో బాలాజీ నగర్ వాసులు రిలాక్స్ అయ్యారు. భారీ వర్షాలు కురిసినప్పుడల్లా చిరుతల సంచారం, ఇలా పాముల బెడద మాత్రం తప్పడం లేదని తిరుమల వాసులు వాపోతున్నారు.