Giant Python Viral Video : ఎవరైనా ఇంట్లో పిల్లులు పెంచుకోవడం చూసుంటారు , శునకాలు పెంచుకోవడం చూసుంటారు. లేదా పక్షులు పెంచుకోవడం చూసుంటారు .. అక్వేరియంలో చేపలు పెంచుకోవడం చూసుంటారు. ఇవేకాకుండా కుందేలు లాంటివి పెంచుకునే వారిని కూడా చూసే ఉంటారు. అతి కృూరమృగాలైన సింహాలు, పులులను పెంచుకునే వారిని కూడా చూసే ఉంటారు కానీ ఆ కోవకు చెందిన వారు అతి తక్కువ సంఖ్యలో.. ఇంకా చెప్పాలంటే చాలా చాలా అరుదుగా ఉంటారు. కానీ పాములను పెంచుకునే వారిని చూశారా ? పాములను పట్టే వారు, లేదా పాములను ఆడించి పొట్టపోసుకునే వారు తప్ప సాధారణ జనం ఎవ్వరూ పాములను పెంచుకోరు కదా. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పామును పెంచుకోవడం అనే మాట వింటేనే ఒళ్లు జలదరిస్తోంది కదూ. కానీ ఇదిగో ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి మాత్రం అలాంటిలాంటి పామును కాదు.. ఏకంగా ఒక పెద్ద పైథాన్ నే పెంచుకుంటోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తోంటే.. అసలు ఇదంతా నిజమేనా.. మన కళ్లు ఏమైనా పొరబడుతున్నాయా అనేలా ఉంది. లేదంటే గ్రాఫిక్ మాయాజాలంతో రెండు వేర్వేరు వీడియోలను ఒక్క చోట మిక్స్ చేసి కొట్టారా అని అనిపించకమానదు. కానీ సోషల్ మీడియాలో కనిపిస్తున్న అనేక కథనాలు మాత్రం ఇది రియల్ వీడియోనే అని చెబుతున్నాయి. వీడియో సైతం గ్రాఫిక్స్ అనడానికి వీల్లేకుండా నిజమైన సీన్ అనేట్టుగానే ఉంది. 



 


సోషల్ మీడియాలో నెటిజెన్స్ ఈ వీడియోపై అనేక కథనాలు అల్లుకుంటున్నారు. ఆ పైథాన్‌తో ఆమెకు విడదీయరాని బంధం పెనవేసుకుపోయిందని... ఆ యువతికి ఏ మాత్రం ఖాళీ సమయం చిక్కినా ఇలా గార్డెన్‌లోకి వచ్చి ఈ భారీ పైథాన్‌తో కాలక్షేపం చేస్తుందని .. ఇలా రకరకాల కథనాలు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూస్తే.. అంత భారీ సైజులో ఉన్న పైథాన్ తన ఒళ్లోంచి పాకుతూ వెళ్తున్నా.. ఆ అమ్మాయి అసలు ఏ మాత్రం పట్టనట్టుగా ఉన్న తీరు చూస్తోంటే.. ఆమెకు ఆ పైథాన్‌తో ఎంత స్నేహం ఉంటే అలా భయం లేకుండా భరిస్తుంది అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు అంత పెద్ద పైథాన్ అలా తనపై నుంచి వెళ్తున్నప్పటికీ.. ఆ అమ్మాయిలో అసలు ఏ మాత్రం చలనం లేదంటే మనం చూస్తోంది నిజమేనా అనే సందేహం కూడా రాకమానదు. ఏదేమైనా మిక్స్‌డ్ ఫీలింగ్స్‌కి గురయ్యేలా చేస్తోన్న ఈ వైరల్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.


ఇది కూడా చదవండి : Cobra Snake Laying Eggs: పాము గుడ్లు పెట్టడం ఎప్పుడైనా చూశారా ?


ఇది కూడా చదవండి : Cheetah Hunting Its Prey: చిరుతపులి వేటాడే సీన్ చూస్తే గూస్‌బంప్స్ రావడం పక్కా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Faceboo