Cobra Snake Laying Eggs: పాము గుడ్లు పెట్టడం ఎప్పుడైనా చూశారా ?

Cobra Snake Laying Eggs: ఒక చోట ఇంట్లోకి పాము చొరబడిందని సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్స్.. అక్కడికి వెళ్లి అతి కష్టం మీద ఆ పామును సురక్షితంగా రెస్క్యూ చేశారు. ఆ సమయంలో పాము సైజును, దాని కదలికలు, ప్రవర్తన చూస్తే.. అది గుడ్లు పెట్టడానికి సిద్ధమవుతోందని ఆ స్నేక్ ఎక్స్‌పర్ట్స్‌కి అర్థమైపోయింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 8, 2023, 05:27 AM IST
Cobra Snake Laying Eggs: పాము గుడ్లు పెట్టడం ఎప్పుడైనా చూశారా ?

Cobra Snake Laying Eggs : పాము గుడ్లు పెడుతుందని చాలా సార్లు వినే ఉంటారు. కానీ పాము గుడ్లు పెట్టడం కానీ లేదా పాము గుడ్లు ఎలా ఉంటాయనే విషయం కానీ చాలా మందికి తెలిసే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే అలాంటి దృశ్యాలు ఎప్పుడో ఒకసారి కానీ చూడ్డానికి దొరకవు.. కెమెరాకు చిక్కవు. కానీ స్నేక్ సైన్స్ తెలుసుకోవాలని ఉవ్విళ్లూరే ఔత్సాహికులు చాలామందే ఉంటారు. అలాంటి వారు ఈ వీడియో చూస్తే పాము గుడ్లు ఎలా ఉంటాయి.. ఆ సమయంలో పాము బిహేవియర్ ఎలా ఉంటుంది అనే విషయాలు తెలుసుకోవచ్చు. 

ఒక చోట ఇంట్లోకి పాము చొరబడిందని సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్స్.. అక్కడికి వెళ్లి అతి కష్టం మీద ఆ పామును సురక్షితంగా రెస్క్యూ చేశారు. ఆ సమయంలో పాము సైజును, దాని కదలికలు, ప్రవర్తన చూస్తే.. అది గుడ్లు పెట్టడానికి సిద్ధమవుతోందని ఆ స్నేక్ ఎక్స్‌పర్ట్స్‌కి అర్థమైపోయింది. దీంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆ పాము కోసం ఓ కృత్రిమ షెల్టర్ ఏర్పాటు చేశారు. గాజు డబ్బాను పోలిన ఆ షెల్టర్ లోకి పామును వదిలేశారు. 

 

గ్లాస్ బాక్సులోకి వెళ్లిన పాము మొత్తం 23 గుడ్లు పెట్టింది. గుడ్లు పెట్టిన తరువాత పామును తీసుకెళ్లి సురక్షితంగా అడవిలో వదిలిపెట్టారు. మరి పాము పెట్టిన గుడ్లను ఏం చేస్తారు అనే కదా మీ సందేహం.. పాము గుడ్లను భద్రంగా దాచిపెట్టి కృత్రిమంగా ఉష్ణోగ్రత పెంచిన వాతావరణంలో గుడ్లను పొదిగేస్తారు. అలా పొదిగిన గుడ్ల నుంచి పాములు పుట్టాకా.. వాటికి తమంతట తాము సొంతంగా ఆహారం వెదుక్కునే వయస్సు వచ్చే వరకు ఫీడింగ్ చేసిన అనంతరం ఆ పాములను అధికారికంగా జూపార్కులకు అప్పగించడం లేదా అడవిలో విడిచిపెట్టడం చేస్తుంటారు.

ఇది కూడా చదవండి : Cheetah Hunting Its Prey: చిరుతపులి వేటాడే సీన్ చూస్తే గూస్‌బంప్స్ రావడం పక్కా

ఇది కూడా చదవండి : Friendship Viral Video: ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే ఆ లెవెలే వేరు కదా.. వైరల్ వీడియో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Faceboo

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x