Buffalo attacks Girl after teasing with song: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇటీవలి కాలంలో జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా చక్కర్లు కొడుతున్నాయి. జంతువులకు సంబంధించి సోషల్ మీడియాలోకి వచ్చే కొన్ని వీడియోలు కడుపుబ్బా నవ్విస్తూ ఉండగా.. మరికొన్ని వీడియోలు ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ఇంకొన్ని వీడియోలు మాత్రం భయపెడుతూ ఉంటాయని ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ గేదెకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నిజానికి ఈ వీడియో పాతదే అయినా ఇప్పుడు మరోసారి ట్రెండ్ అవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీడియో ప్రకారం.. ఓ పల్లెటూరి యువతి బాలీవుడ్ 'దేవదాస్' సినిమాలోని మార్ డాలా పాటకు రీల్ చెయ్యాలనుకుంది. అందుకు ఓ గేదెను ఎంచుకుంది. గేదె ముందు యువతి రీల్ చేయడం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ముందుగా గేదెకు దాణా వేసింది. తర్వాత మార్ డాలా పాటకు డాన్స్ చేయడం మొదలుపెట్టింది. యువతి డాన్స్ చూసిన గేదె.. ఒక్కరిగా కంగారుపడిపోయింది. యువతి తనను ఏదో చేస్తోందనే టెన్షన్‌తో.. ఒక్కసారిగా ఆమెపై దాడి చేసింది. దాంతో యువతి పక్కనే ఉన్న కుడిది గోలెంలో బొక్కబోర్లా పడింది. 



ఇందుకు సంబందించిన వీడియోను 'psycho_biharii2' అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో 14 వారాల క్రితం పోస్ట్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటివరకూ 27 వేలకు పైగా లైకులు వచ్చాయి. మరోవైపు లక్షలలో వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో చూసి నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. గేదెను టీజ్ చేసింది.. మూల్యం చెల్లించుకుంది, గెలికితే ఊరుకుంటుందా, బాగా అయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 


Also Read: రోజూ స్కూలుకొచ్చి.. పిల్లలతో పాటు పాఠాలు వింటున్న కొండముచ్చు! నమ్ముకుంటే ఈ వీడియో చూడండి


Also Read: Roger Binny BCCI: బీసీసీఐ అధ్యక్షుడిగా రోజర్‌ బిన్నీ.. కార్యదర్శి జై షానే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook