Angry Girl Acid attack On Boyfriend: పెళ్లిలో ఊహించని ఘటన.. వరుడిపై యాసిడ్ దాడి.. షాకింగ్ వీడియో వైరల్..
Girl Acid attack On Boyfriend: పెళ్లి వేడుక ఎంతో గ్రాండ్ ప్రారంభమైంది. బంధువులు,స్నేహితులు ఎంతో ఉల్లాసంగా వేడుకలో పాల్గొంటున్నారు. యువకుడికి బారత్ పెళ్లి మండపం దగ్గరకు వెళ్తుంది. ఇంతలో ఒక యువతి ఒక్కసారిగా వరుడి వద్దకు చేరుకుని అతని ముఖంపై యాసిడ్ తో దాడికి పాల్పడింది.
Girl Acide Attack On Ex lover In Uttar Pradesh: మనలో చాలా మంది యువత ప్రేమ పెళ్లిళ్లు చేసుకొవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రేమలో కొన్నిరోజుల పాటు ఇద్దరు కలిసి ట్రవెల్ చేస్తారు. దీని వల్ల ఒకరి ఆలోచనలు, అభిప్రాయాలు మరోకరు అర్దం చేసుకొవడానికి కొంత సమయం పడుతుంది. ఇవన్ని నచ్చితే పెళ్లి వరకు వెళ్తున్నారు. ఒక వేళ ఏమైన బేధాభి ప్రాయాలు వస్తే మాత్రం తమ బంధానికి బ్రేకప్ లు చెప్పేసుకుంటున్నారు. ఈ క్రమంలో కొంత మంది యువత పెళ్లికి ముందే లీవ్ ఇన్ రిలేషన్ షిప్ లో కూడా ఉంటున్నారు. కొందరు యువతకు ప్రేమను అంగీకరించకుంటే మాత్రం ఉన్మాదులుగా మారుతున్నారు. ప్రేమించిన వాళ్లను చంపడం లేదా బలవంతంగా వివాహాం చేసుకొవడం చేస్తున్నారు. మరికొందరు సుపారీలు ఇచ్చి చంపించడానికి సైతం వెనుకాడటంలేదు.ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి.
కొందరు అబ్బాయిలు తమను కాదన్న యువతులపై దాడులకు దిగుతుంటారు. ముఖంపై యాసిడ్ దాడుల చేయడం, వాళ్లతో చనువుగా ఉన్న ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. దీంతో వారి వ్యక్తిగత జీవితాన్ని ఇబ్బందులకు గురిచేస్తుంటారు. ఇలాంటి ఘటనలు మనం అనేకం చూశాం. యువతులు మీద దాడిచేసి చంపడం వంటివి కూడా అనేక ఘటనలు వార్తలలో నిలిచాయి. ఇక్కడ ఒక యువతి తనను కాదని, మరోయువతిని పెళ్లాడటానికి రెడీ అయిపోయాడు. దీంతో సదరు యువతి అతనిపై యాసిడ్ తో దాడికి దిగింది.ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు..
ఉత్తర ప్రదేశ్ లోని బల్లియాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా డుమ్రీ ప్రాంతంలో నివాసముండే, ఇద్దరు యువతీ యువకులు కొన్నిరోజులుగా రిలేషన్ లో ఉన్నారు. ఇంట్లో వాళ్లకు తెలియకుండా ప్రేమాయాణాలు నడిపించారు. యువతి, సదరు యువకుడే తన భర్త అనిఫిక్స్ అయిపోయింది. కొద్ది రోజులకు ఇంట్లో వీరి వ్యవహారం తెలిసిపొయింది. దీంతో లాభంలేక,యువకుడి బంధువులు తమ కుమారుడికి మరో ప్రాంతానికి ఉద్యోగానికి తరలించారు. అంతేకాకుండా సీక్రెట్ గా మరో యువతితో పెళ్లి కూడా సెట్ చేసేశారు. పెళ్లివేడుక గురించి యువతికి తెలియకుండాజాగ్రత్తపడ్డారు. కానీ ఎలా తెలిసిందో కానీ.. అతగాడి ప్రియురాలికి ఈవిషయం తెలిసిపోయింది. దీంతో వరుడికి బుద్ధి చెప్పాలనుకుంది.
కోపంతో తనను మోసం చేస్తాడా..రీవెంజ్ తీర్చుకొవాలని భావించి, పెళ్లి వేడుకకు వెళ్లింది. అతిథుల మాదిరిగానే వెళ్లి.. తన ప్రియుడి బరాత్ లో పాల్గొంది. అక్కడున్న వారు కూడా తమ బంధువులు ఏమో అని అనుకున్నారు. ఇంతలో పెళ్లికొడుకు దగ్గరకు వెళ్లి ఒక్కసారిగా ఒక సీసలోని యాసిడ్ ను అతని ముఖంపై వేసింది. గట్టిగా అరుస్తు, అతడిని తిట్టింది. దీంతో అక్కడున్న వారంతా షాక్ కు గురయ్యారు.
వెంటనే తెరుకుని యువతిని బంధించారు. వరుడిని ఆస్సత్రికి తరలించారు. యువతిపై కొందరు పిడిగుద్దులు కురిపించారు. యువకుడి బంధువులు.. దాడికి పాల్పడిన యువతిని పోలీసుస్టేషన్ కు తీసుకెళ్లి అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter