Goa Viral Video: దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు (Covid rules in India) కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. ఎక్కువ మంది గుమిగూడొద్దని హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా పార్టీల వంటి వాటిలో జాగ్రత్తగా వ్యవహరించాలని (corona restrictions) సూచిస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ప్రముఖ పర్యాటక ప్రాంతం గోవాలో ప్రజలు కొవిడ్ భయాలను కనీసం పట్టించుకోవడం లేదు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా వందలాది మంది కొవిడ్​ నిబంధనలను విస్మరించి (Tourists not following Corona rules in Goa) తిరుగుతున్నారు.


క్రిస్మస్​, న్యూఇయర్​తో పాటు (New Year in Goa) లాంగ్ వీకెండ్ రావడంతో గోవాకు టూరిస్టుల తాకిడి పెరిగింది. అయితే టూరిస్టులంతా కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే పార్టీల్లో పాల్గొనాలనే రూల్ ఉన్నా ఎవ్వరూ వాటిని లెక్క చేయలేదు. ఉత్తర గోవాలోని బాగా బీచ్​ సమీపంలో జనసంచారానికి సంబంధించి ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్​ అవుతోంది. 'ఇది కొవిడ్​ కొత్త వేవ్​కు రాయల్​ వెల్​కం' అనే క్యాప్షన్​తో ట్రెండ్​ అవుతోంది.


వీడియోలో ఏముందంటే..


న్యూ ఇయర్​ వేడుకల్లో వందలాది మంది రోడ్లపైకి చేరి అటు ఇటూ నడుస్తూ కనిపించారు. భౌతిక దూరం అటుంచి.. ఇసకేస్తే రాలనంత మంది తిరుగుతూ కనిపించారు. రొడ్డుపై దాదాపు కిలో మీటర్​ మేర ఇదే పరిస్థితి కనిపించింది.


కొవిడ్ నిబంధనలను పక్కకు పెట్టి.. (Corona rules in India) జనాలు ఇలా ఇష్టానుసారంగా తిరుగుతుండటంపై నెటిజన్లు మండిపడుతున్నారు. పార్టీలు, ఎలక్షన్​లు ఆగుతాయేమో కానీ.. కొవిడ్ ఎవరికోసం ఆగదని అంటున్నారు.


ఈ ఘటనకు బాధ్యులు ఎవరని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం పార్టీలకు అనుమతి ఇవ్వడమే ఇలాంటి ఘటనలకు కారణమని (Corona in Goa) మరికొందరు అభిప్రాయపడుతున్నారు.



Also read: Viral Video: నిరాశ్రయుడికి హగ్ ఇచ్చిన కుక్క, దాని ప్రేమ అద్భుతమంటోన్న నెటిజెన్స్


Also read: Emerald Shivling: రూ.500 కోట్ల విలువైన శివలింగం స్మగ్లింగ్.. తమిళనాడులో అధికారుల స్వాధీనం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook