Emerald Shivling: రూ.500 కోట్ల విలువైన శివలింగం స్మగ్లింగ్.. తమిళనాడులో అధికారుల స్వాధీనం

Emerald Shivling: వెయ్యేళ్ల నాటి చరిత్ర కలిగిన అరుదైన మరకత శివలింగాన్ని తమిళనాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని తంజావూరులో ఈ శివలింగం బయటపడింది. దీని విలువ రూ.500 కోట్లు ఉంటుందని నిపుణులు అంచనా వేశారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 1, 2022, 10:33 PM IST
Emerald Shivling: రూ.500 కోట్ల విలువైన శివలింగం స్మగ్లింగ్.. తమిళనాడులో అధికారుల స్వాధీనం

Emerald Shivling: వెయ్యేళ్ల నాటి చరిత్ర కలిగిన మరకత శివలింగాన్ని తమిళనాడు ఐడల్స్ స్మగ్లింగ్ నిరోధక అధికారులు తంజావూరులో స్వాధీనం చేసుకున్నారు. ఈ విగ్రహం చోళుల కాలం నాటిది అని వారు గుర్తించారు. 

తంజావూరులోని అరులానంద ప్రాంతంలో నివాసం ఉంటున్న సామియపన్ అనే వ్యక్తి ఇంట్లో విలువైన శివలింగాలు ఉన్నట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో డిసెంబరు 30న అతడి ఇంట్లో సోదాలు జరిపారు. వారికి సంబంధించిన బ్యాంకు లాకర్ లో మరకత శివలింగం బయటపడింది. అయితే దానికి సంబంధించిన ధ్రువపత్రాలేవి నిందుతుల వద్ద లేవని అధికారులకు అర్థమైంది. దీంతో ఆ విగ్రహాన్ని స్వాధీనం చేసుకొని.. దాని వివరాలను బయటపెట్టారు. 

ఆ మరకత శివలింగాన్ని ఆర్కియాలజీ అధికారులకు అందించగా.. దాని విలువ ఏకంగా రూ.500 కోట్ల విలువ ఉంటుందని చెప్పారు. దీని వెనుక వెయ్యేళ్ల నాటి చరిత్ర ఉందని వారు స్పష్టం చేశారు. ఈ శివలింగాన్ని ముసుకుంత చోళ రాజు దానం చేశారని.. తిరుకువలై ఆలయంలో 2016 సంవత్సరంలో అదృశ్యమైన మరకత ​​విగ్రహం ఇదేనని వారు తేల్చి చెప్పారు. అయితే ఈ విగ్రహాన్ని చోరీ చేసి.. విదేశాలకు అమ్మేయాలని నిందితులు ప్లాన్ చేసినట్లు అక్రమ నిరోధక శాఖ అధికారులు విచారణలో తేల్చారు.  

మరకత శివలింగం ప్రాముఖ్యత

మరకతంతో పొదగబడిన ఈ శివలింగం.. ఎంతో ప్రాముఖ్యమైనదని, అద్భుతమైన లక్షణాలు ఆ విగ్రానికి ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. పాదరసం రంగుతో కలిగిన ఈ శివలింగాన్ని పూజిస్తే కోరిన వరాన్ని పొందుతారని చెబుతారు. 

ఈ పచ్చ లింగాన్ని పూజించడం వల్ల ఆకర్షణ శక్తి, ఆలోచన, శారీరక ఆరోగ్యం, ప్రోత్సాహం, విద్య సహా మొదలగు అంశాలు కలిసి వస్తాయని ప్రచారం. దీంతో దోష నివారణ జరుగుతుందని ప్రసిద్ధి. 

మొత్తం 7 మరకత లింగాలు

ఈ మరకత లింగాల చరిత్ర ప్రకారం.. ముసుంకుంత అనే చోళ రాజు కఠోర తపస్సు చేసి.. ఇంద్రుని నుంచి 7 మరకత లింగాలను పొందాడు. ఆ ఏడు మరకత శివలింగాలు తిరువారూర్, తిరునల్లార్, వేదారణ్యం, తిరుకువలై, నాగపట్నం, తిరుక్కరవాసల్, తిరువాయుమూర్ అనే ఏడు శివాలయాల్లో ప్రతిష్ట చేశారని చరిత్ర చెబుతోంది. 

Also Read: Corona Update: ముంబయిలో కొవిడ్​ కల్లోలం.. కొత్తగా 6,347 మందికి పాజిటివ్​

Also Read: Ayyappa Idol Eyes Open: అభిషేకం జరుగుతుండగా కళ్లు తెరిచిన అయ్యప్ప విగ్రహం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News