గూగుల్ కు (Google) చెందిన ఎప్లికేషన్ గూగుల్ డ్రైవ్ ( Google Drive )ను మీరు ఫైల్, ఫోల్డర్, వీడియోలు షేర్ చేయడాని వాడితే ఈ వార్త మీకోసమే. గూగుల్ తన ఎప్లికేషన్ లో భారీ మార్పులు చేస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గూగుల్ డ్రైవ్ లో ఇకపై ట్రాష్ ఫైల్స్ శాశ్వతంగా స్టోర్ అవ్వవు. సంస్థ తన ఈ సిస్టమ్ ను మార్చింది. ఇకపై ట్రాష్ లో ఉన్న ఫైల్స్ డ్రైవ్ లో కేవలం 30  రోజులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఆ తరువాత ఆటోమెటిక్ గా డిలీట్ అవుతాయి.



ALSO READ|Mukesh Ambani Facts: ముఖేష్ అంబానీ నిమిషానికి 23 లక్షలు సంపాదిస్తాడు తెలుసా ?


13 అక్టోబర్ నుంచి కొత్త ఫీచర్


గూగుల్ తన డ్రైవ్ యాప్ లో ఈ మార్పులను అక్డోబర్ 13 నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు గూగుల్ డ్రైవ్ లో ట్రాష్ ఫైల్స్ అనిశ్చిత సమయం వరకు అలాగే సేవ్ అయి ఉండేవి. అయితే ఇప్పుడు ఈ డ్రైవ్ లో కూడా జీమెయిల్ లా (Gmail) ట్రాష్ లిమిటెడ్ కాలం తరువాత డిలీట్ అవనుంది. అంటే ఇకపై మీరు డిలీట్ చేయబోయే ఫైల్స్ ను ఒకటికి రెండు సార్లు చెక్ చేయాల్సిందే. తరువాత ట్రాష్ ను రెగ్యులర్ గా చెక్ చేయాల్సిందే. లేదంటే ఇబ్బంది పడాల్సి ఉంటుంది.



ALSO READ| Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా ? ఈ విషయంలో జాగ్రత్త


సమాచారం ప్రకారం గూగుల్ డ్రైవ్ లోని ట్రాష్ లో ఏవైనా ఫైల్స్ ఉంటే అవి అక్టోబర్ 13 నుంచి అలాగే ఉంటాయి. ముప్పై రోజుల తరువాత అవి ఆటోమెటిక్ గా డిలీట్ అవుతాయి. ఈ మార్పులు జీ సూట్ లో ( G Suite ) ఉన్న ఇతర యాప్ అయిన జీ మెయిల్ లాగే ఉంటాయి.


గూగుల్ డ్రైవ్ అనేది ఆన్ లైన్ లో ఫైల్స్ స్టోర్ చేసే ఒక ఎప్లికేషన్. ఇందులో మీరు ఫైల్స్, ఫోల్డర్స్, వీడియోలను ఆన్ లైన్ లో సేవ్ చేసుకోవచ్చు. గూగుల్ యూజర్లు మొత్తం 15 జీబిల వరకు ఉచితంగా స్టోర్ చేసుకోగలరు. మరింత స్టోరేజ్ కెపాసిటీ కోసం కొనుగోలు చెయాల్సి ఉంటుంది.


ALSO READ|Mukesh Ambani Facts: ముఖేష్ అంబానీ నిమిషానికి 23 లక్షలు సంపాదిస్తాడు తెలుసా ?


 


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే     ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR