ముఖేష్ అంబానీ మొత్తం భారత దేశంలోనే కాదు.. ఏషియాలోనే అత్యంత ధనవంతుడు.
ముఖేష్ అంబానీ మొత్తం భారత దేశంలోనే కాదు.. ఏషియాలోనే అత్యంత ధనవంతుడు. 2010లో ఒక అంచనా ప్రకారం అతని నెట్వర్త్ 27 బిలియన్లు కాగా.. 2020లో 80 బిలియన్లు. దీంతో ముఖేష్ అంబానీ ప్రపంచంలోనే 5వ అత్యంత ధనవంతుడైన వ్యక్తిగా నిలిచాడు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ వరుసగా భారీ విజయాలతో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం అతను ఏషియాలోనే అత్యంత ధనవంతుడు. ప్రపంచం టాప్ 10 ధనవంతుల్లో ఒకరు.
2010లో ఒక అంచనా ప్రకారం అతని నెట్వర్త్ 27 బిలియన్లు కాగా.. 2020లో 80 బిలియన్లు.
2019 నుంచి ఇప్పటి వరకు చాలా మంది బిలియనీర్ల సంపద తరగుతూ వస్తోంటే.. ముఖేష్ అంబానీ సంపద మాత్రం రెట్టింపు అయింది
2019లో ముఖేష్ అంబానీ ఆదాయాన్ని గమనిస్తే ప్రతీ నిమిషం 23,48,808 ఆదాయం సంపాదిస్తున్నట్టు తేలింది.
కరోనా కాలంలో చాలా మంది ఆస్తి ఐసుముక్కలా కరిగిపోతోంటే అంబానీ సంద మాత్రం అమాంతం పెరిగిపోతోంది. దీంతో అతను ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన 5వ వ్యక్తి.
ముఖేష్ అంబానీ ప్రారంభించిన జియోలో ఫేస్ బుక్ పెట్టుబడి పెట్టింది. జియోమార్ట్ పై ప్రత్యేక ఫోకస్ పెట్టింది.