Google Incognito: గూగుల్ ఇన్‌కాగ్నిటో మోడ్. గూగుల్ సెర్చింజన్‌లో ఓ భాగం. సెర్చ్ హిస్టరీ ఎవరి కంటపడకుండా ఉండేందుకు ఉపయోగించే పద్ధతి. అయితే ఇప్పుడు ఇన్‌కాగ్నిటో రక్షణపై ప్రశ్నలు వస్తున్నాయి. ఇన్‌కాగ్నిటో బ్రౌజింగ్ మోడ్ ఎంతవరకూ క్షేమమో పరిశిలిద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాంకేతికత అనేది నిరంతర అప్‌డేట్ అయ్యే ప్రక్రియ. ఎంతగా అప్‌డేట్ అయినా ఏవో కొన్ని లోపాలు బయటపడుతూనే ఉంటాయి. ఇప్పుడు గూగుల్‌పై కొత్తగా కొన్ని ఆరోపణలొచ్చాయి..ఆ ఆరోపణలపై ఇప్పుడు కోర్టులో విచారణ సాగుతోంది.సెర్చింజన్ గూగుల్ క్రోమ్‌లో ఇన్‌కాగ్నిటో బ్రౌజింగ్ మోడ్(Incognito Browser Mode) గురించి అందరికీ తెలుసు. ఏయే అంశాలు సెర్చ్ చేశారనేది తెలియకుండా ఉండేందుకు చాలామంది ప్రైవసీ కోసం ఇన్‌కాగ్నిటో బ్రౌజింగ్ మోడ్ ఉపయోగిస్తుంటారు. వ్యక్తిగతంలో సెర్చ్ చేసుకునేందుకు గూగుల్ సంస్థ(Google)యూజర్లకు కల్పించిన వెసులుబాటు ఇది. అయితే ఇది కూడా క్షేమం కాదనే ఆరోపణలు ఇప్పుడు విన్పిస్తున్నాయి. 


ఇన్‌కాగ్నిటో సెర్చ్ ఇంజన్‌లో(Search Engine) యూజర్ల భద్రతకు గ్యారంటీ లేదని కొందరి ఆరోపణ. ఇందులోని సమాచారాన్ని గూగుల్ ఎవరికీ తెలియకుండా సేకరిస్తోందని గత ఏడాది కొందరు కాలిఫోర్నియా(California) కోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్‌పై విచారణ జరుగుతుండగానే..ఆరోపణలకు సంబంధించిన కీలక ఆధారాల్ని పిటీషనర్లు కోర్టుకు సమర్పించినట్టు తెలుస్తోంది. ఇన్‌కాగ్నిటో(Incognito)బ్రౌజర్ అనేది సురక్షితం కానేకాదని, గూగుల్‌కు అన్నీ తెలిసి కూడా దాచిపెడుతోందనేది ప్రధాన ఆరోపణ. 2019లో గూగుల్ ఛీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ నేతృత్వంలో జరిగిన ఓ ప్రాజెక్టులో స్వయంగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఇన్‌కాగ్నిటో బ్రౌజింగ్ మోడ్‌పై అనుమానాలు వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ మోడ్‌లో చాలా సమస్యలున్నాయని..ఆ ఫీచర్ అవసరం లేదనిపిస్తోందని సుందర్ పిచాయ్ అభిప్రాయపడ్డారు. యూజర్‌ని ట్రాక్ చేసే ఈ వ్యవస్థ వల్ల వ్యక్తిగత డేటా సైతం లీకయ్యే అవకాశముందని కూడా సుందర్ పిచాయ్(Sunder pichai)చెప్పినట్టు సమాచారం. సమస్య తెలిసి కూడా సీక్రెట్ బ్రౌజింగ్ మోడ్‌ను ప్రమోట్ చేశారనేది ప్రధాన ఆరోపణగా ఉంది. 


ఆయితే ఇదంతా గూగుల్‌ని బద్నాం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నమని గూగుల్ ప్రతినిధి జోస్ కాప్టానెడా తెలిపారు. ఇన్‌కాగ్నిటో మోడ్ ద్వారా గూగుల్ యూజర్లకు వచ్చే ముప్పేమీ లేదని గూగుల్ చెబుతోంది. 


Also read: Ports Privatization: దేశంలో పోర్టుల ప్రైవేటీకరణ ఇప్పట్లో లేనట్టేనా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి