Ports Privatization: దేశంలో పోర్టుల ప్రైవేటీకరణ ఇప్పట్లో లేనట్టేనా

Ports Privatization: దేశంలోని పోర్టులు ప్రైవేట్‌పరం కానున్నాయనే వార్తలు గత కొద్దికాలంగా విన్పిస్తున్నాయి. ఈ విషయంపై కేంద్ర మంత్రి స్పష్టత ఇచ్చారు. దేశంలోని మేజర్ పోర్టుల ప్రైవేటీకరణపై స్పందించారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 25, 2021, 12:25 PM IST
Ports Privatization: దేశంలో పోర్టుల ప్రైవేటీకరణ ఇప్పట్లో లేనట్టేనా

Ports Privatization: దేశంలోని పోర్టులు ప్రైవేట్‌పరం కానున్నాయనే వార్తలు గత కొద్దికాలంగా విన్పిస్తున్నాయి. ఈ విషయంపై కేంద్ర మంత్రి స్పష్టత ఇచ్చారు. దేశంలోని మేజర్ పోర్టుల ప్రైవేటీకరణపై స్పందించారు.

దేశంలో ప్రభుత్వరంగ సంస్థలు ప్రైవేట్ దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలో దేశంలోని మేజర్ పోర్టుల్ని(Major Ports Privatization) ప్రైవేటీకరిస్తారనే వార్తలు గత కొద్దికాలంగా విన్పిస్తున్నాయి. ఈ విషయంపై కేంద్ర పోర్టులు, షిప్పింగ్ శాఖ సహాయమంత్రి శాంతను ఠాకూర్ స్పష్టత ఇచ్చారు.  మూడ్రోజుల పర్యటన కోసం విశాఖపట్నం చేరుకున్న ఆయన పోర్టుల ప్రైవేటీకరణ అంశంపై మాట్లాడారు. విశాఖపట్నం పోర్టులో జరుగుతున్న అభివృద్ధి పనుల్ని పరిశీలించారు. పోర్టు ఆవరణలో ఏర్పాటైన స్వచ్ఛతా అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఇండియన్ పోర్టుల ముసాయిదా బిల్లును(Indian Ports Draft Bill) ఏపీతో పాటు తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఈ రాష్ట్రాలతో మరోసారి చర్చించి ప్రైవేటీకరణపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రైవేటు పోర్టుల నుంచి వస్తున్న పోటీ నేపధ్యంలో విశాఖ పోర్టు(Visakhapatnam Port) అమలు చేస్తున్న బెర్తు లీజుల్ని క్రమబద్ధీకరించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. క్రూయిజ్ టెర్మినల్, పలు బెర్త్‌ల అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. గత పదేళ్ల కాలంలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం పద్ధతిలో విశాఖపట్నం పోర్టు 2 వేలకోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించిందన్నారు. మరోైపు మారిటైమ్ ఇండియా సమ్మిట్‌లో పోర్టు 26 వేల కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించిందని కేంద్ర మంత్రి శాంతను ఠాకూర్ (Union minister Shanthanu Thakur)తెలిపారు. రానున్న 8 నెలల్లో విశాఖ-రాయపూర్ సాగరమాల ప్రాజెక్టు పనుల్ని ప్రారంభించనున్నారు.

Also read: Private Versity Act: ప్రైవేటు వర్శిటీ చట్ట సవరణ, పేదలకు ఇకపై 35 శాతం సీట్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News