Google Maps Dark Theme Feature For Android Users: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. అసలే మనం రాత్రిపగలూ అనే తేడా లేకుండా స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తున్నాంటాం. అయితే దీని వల్ల కంటిచూపు, కంటి పనితీరుపై ప్రభావం పడే అవకాశం ఉంది. కనుక గూగుల్ మ్యాప్స్ తన ఆండ్రాయిడ్ వినియోగదారులకు డార్క్ మోడ్ థీమ్ తీసుకొచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ విషయాన్ని గూగుల్ మ్యాప్స్ తమ ఆండ్రాయిడ్ ఖాతా ట్వీట్‌లో పేర్కొంది. గూగుల్ గత ఏడాది సెప్టెంబర్ నుండి గూగుల్ మ్యాప్స్ డార్క్ మోడ్‌ను పరీక్షిస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఆండ్రాయిడ్ వినియోగదారుల(Android Smartphone) కోసం డార్క్ థీమ్ తీసుకొచ్చింది. నైట్ మోడ్ ‘మీ కళ్లకు చాలా అవసరం’ మరియు బ్యాటరీ లైఫ్ సైతం పెరుగుతుందని గూగుల్ మ్యాప్స్ తెలిపింది.


Also Read: GoAir Summer Sale: సమ్మర్ సేల్ ఆఫర్లు ప్రకటించిన గోఎయిర్ ఎయిర్‌లైన్స్, నేటి నుంచి స్పెషల్ Bookings


Google Maps Dark Theme కోసం ఇలా చేయండి
డార్క్ థీమ్‌ను మీరు వాడుకోవాలంటే మొదటగా యాప్‌లో సెట్టింగ్స్ మార్చుకోవాలి. అందులో భాగంగా  గూగుల్ మ్యాప్స్(Google Maps)‌లో కుడివైపు పైమూలలో ఉన్న మీ ప్రొఫైల్‌ను క్లిక్ చేయండి. కాన్ఫిగరేషన్ సెలక్షన్ జాబితాలో థీమ్ సెట్టింగ్స్(Theme Settings)కు వెళ్లండి. అందులో ఆపై డార్క్ మోడ్‌ను సెలక్ట్ చేసుకోండి. ఈ కొత్త ఫీచర్ పొందాలంటే స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఆండ్రాయిడ్ ఓఎస్ వెర్షన్ 10.61.2 ను డౌన్‌లోడ్ చేసుకుని పైన పేర్కొన్న విధంగా సెట్టింగ్స్ మార్చుకోవాలి.


Also Read: Gold Price Today In Hyderabad: బులియన్ మార్కెట్‌లో పెరిగిన బంగారం ధర, Silver Price  


డార్క్ మోడ్‌లో గూగుల్ మ్యాప్స్ బ్యాక్‌గ్రౌండ్ ముదురు బూడిద రంగులో కనిపిస్తుంది. ఇందులో లేత బూడిద రంగులో వీదులు, ప్రాంతాల పేర్లు కనిపిస్తాయి. తద్వరా వినియోగదారులు ముఖ్యమైన ల్యాండ్‌మార్క్ మరియు రహదారులను సులభంగా గుర్తించగలుగుతారు.


వీటితో పాటు గూగుల్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల కోసం పాస్‌వర్డ్ చెకప్ ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ పాస్‌వర్డ్ చెకప్ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ 9 మరియు ఆ తరువాత లేటెస్ట్ వెర్షన్‌లు ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్లలో మీరు ఉపయోగించుకోవచ్చు.


Also Read: WhatsApp New Feature: వాట్సాప్ సరికొత్త ఫీచర్, ఒకేసారి 50 మందితో వీడియో కాలింగ్ సదుపాయం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook