ప్రైవసీ పాలసీ వివాదం ఎదుర్కొంటున్న వాట్సాప్ తన వినియోగదారులకు సరికొత్త ఫీచర్ తీసుకొచ్చింది. తన మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా చేసే ప్రయత్నంలో ఫేస్బుక్ యాజమాన్యంలోని ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ‘మెసెంజర్ రూమ్’ అనే కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఒకేసారి 50 మందితో గ్రూప్ వీడియో కాల్ చేసి మాట్లాడుకునే అవకాశం కల్పిస్తోంది.
మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ ప్రకారం, ఈ యాప్ ఉపయోగించడం ద్వారా మొబైల్ లేదా వెబ్ బ్రౌజర్లో రూమ్ క్రియేట్ చేసి ఒకేసారి భారీ సంఖ్యలో Messenger Room ద్వారా గ్రూప్ కాలింగ్ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. వినియోగదారులు వాట్సాప్(WhatsApp)లోని గ్రూప్ చాట్లకు ఇన్విటేషన్ లింక్‌లను పంపవచ్చు, దాని ద్వారా చాట్ రూమ్‌లకు ఎంటరై సంభాషించే సందుపాయాన్ని వాట్సాప్ తీసుకొచ్చింది. ఫేస్బుక్ అకౌంట్, మెసేంజర్ యాప్ లేకున్నా ఈ వీడియో కాలింగ్ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చునని తెలిపింది.
Also Read: Android Smartphone: మీ మొబైల్ పోయిందా, దాన్ని కనుగొని Data Erase చేయడానికి ఇది చదవండి
రూమ్ లింక్ క్రియేట్ చేసి షేర్ చేసే విధానం..
- వాట్సాప్ వెబ్ (WhatsApp Web) లేదా డెస్క్‌టాప్ ఓపెన్ చేయాలి
- మీరు వీడియో కాల్ చేయాలనుకునే వారి వ్యక్తిగత చాట్‌కు వెళ్లాలి. అందులో వీడియో కాల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి
- స్క్రీన్ మీద కనిపించిన అటాచ్మెంట్స్ ఐకాన్ మీద క్లిక్ చేయాలి
- ‘రూమ్స్’ ఆప్షన్ మీద క్లిక్ చేయండి
- ‘కంటిన్యూ ఇన్ మెసెంజర్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
Also Read: WhatsApp Privacy Policy అంగీకరించకపోతే వినియోగదారులకు వాట్సాప్ సేవలు బంద్
వాట్సాప్ యాప్ మీకు ఓ లింక్‌ను అందిస్తుంది. మీ స్నేహితులు, ఉద్యోగులు, వాట్సాప్ కాంటాక్ట్స్‌లో ఉన్న వారికి ఆ లింక్ షేర్ చేయాలి. ఆ ప్రత్యేకమైన లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా ఒకే గదిలో మీరందరూ చేరవచ్చు. గ్రూప్ విషయంలో అయితే 5 కన్నా ఎక్కువ మంది సభ్యులు ఉన్న గ్రూప్‌లలో మాత్రమే ‘మెసెంజర్ రూమ్’ ఫీచర్ పని చేస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook