Google Additional Security: గూగుల్ మరింత సెక్యూర్ కానుంది. వినియోగదారులకు అదనపు భద్రత చేకూరుస్తోంది. ఇక గూగుల్ లాగిన్ కావాలంటే రెండు దశల ధృవీకరణ తప్పనిసరిగా మారింది. మరో రెండ్రోజుల్లో కొత్త విధానం అమల్లోకి రానుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గూగుల్ ఎక్కౌంట్ (Google Account)హోల్డర్స్ అందరికీ గూగుల్ నుంచి కొత్త అప్‌డేట్ వస్తోంది. ఇక నుంచి అంటే మరో రెండ్రోజుల్లో గూగుల్ కొత్త విధానాన్ని ప్రవేశపెడుతోంది. కొత్తగా వినియోగదారుల అదనపు భద్రత కోసం గూగుల్.. 2SV అంటే రెండు దశల ధృవీకరణ తప్పనిసరి చేసింది. 


గూగుల్ ఖాతాను కలిగివున్న వినియోగదారులందరికీ రెండు దశల ధృవీకరణ (2SV)(Google 2SV Verification) ఇప్పుడు తప్పనిసరి అయింది. వాస్తవానికి, కంపెనీ నవంబర్ 9 నుండి వినియోగదారులందరికీ 2SVని అమలు చేస్తోంది. నవంబర్ 9 నుంచి ఈ కొత్త విధానం అమల్లో రానుంది. ఈ ధృవీకరణ అనంతరం మీ ఖాతాలో లాగిన్ అయ్యేందుకు కొత్త లేయర్ యాడ్ అవుతుంది. ఈ 2SV ప్రక్రియ గురించి తెలుసుకుందాం. ఎలా ఈ ధృవీకరణ ఉంటుందో పరిశీలిద్దాం.


గూగుల్ సెర్చ్ ఇంజన్‌కి వెళ్లి..గూగుల్ రెండు దశల ధృవీకరణను సెర్చ్ చేయండి. ఇక్కడ మొదటి ఫలితం నిర్ధారణ అవుతుంది. దానిపై క్లిక్ చేయండి. మీరు నేరుగా లింక్ ద్వారా కూడా 2 స్టెప్ వెరిఫికేషన్ కి  వెళ్లవచ్చు. ఇప్పుడు ఎగువన ఉన్న గెట్‌స్టార్ట్‌పై క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో దిగువన ఉన్న గెట్‌స్టార్ట్‌పై క్లిక్ చేయండి. మీ ఇమెయిల్ ID..పాస్‌వర్డ్‌ను నమోదు చేయడం ద్వారా లాగిన్ కావల్సి ఉంటుంది. ఇప్పుడు మీ స్మార్ట్ ఫోన్ వివరాలు కన్పిస్తాయి. ఇక్కడ దిగువన ఉన్న కంటీన్యూపై క్లిక్ చేయండి. మీ ఫోన్ నంబర్‌కు క్లిక్ చేయండి. ఇప్పుడు మీ నంబర్‌పై OTP వస్తుంది. దానిని నమోదు చేసి తర్వాత టూ స్టెప్ వెరిఫికేషన్ 2SV ఆన్ చేయాలి.
Google ఈ సంవత్సరం 2SVని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. 2021 చివరి నాటికి 2SVలో 150 మిలియన్లు Google వినియోగదారులను ఆటో ఎన్‌రోల్ చేయాలని తాము ప్లాన్ చేస్తున్నామని కంపెనీ తన బ్లాగ్‌పోస్ట్‌లో వెల్లడించింది. ఈ ప్రక్రియ ముగిసిన తరువాత నవంబర్ 9న, 2SV ఫీచర్ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుంది. నివేదికల ప్రకారం, రెండు దశల ధృవీకరణను ప్రారంభించడానికి Google వినియోగదారులందరికీ ఇమెయిల్..యాప్‌లో ధృవీకరణను పంపుతోంది. వెరిఫికేషన్ ప్రాసెస్ ఎనేబుల్ కాకపోతే నవంబర్ 9న ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుందని మెసేజ్‌లో చెబుతున్నారు.


లాగిన్ కోసం ఫోన్‌కు రెండు దశల ధృవీకరణ( Two Stage Verification) అవసరం అంటే మీరు మీ లాగిన్‌ను యాక్సెస్ చేయడానికి అదనపు దశను అనుసరించాలి. అంటే, మీ ఎక్కౌంట్ భద్రత(Google Account Security) మునుపటితో పోలిస్తే పెరుగుతుంది. ఈ ప్రక్రియలో, మీరు మీ Google ఖాతాకు లాగిన్ చేసినప్పుడు, పాస్‌వర్డ్‌తో పాటు OTP కూడా అవసరం. ఇది లేకుండా ఖాతా లాగిన్ అవ్వదు. అంటే, మీ ఖాతాను ఎవరూ ఇకపై అంత సులభంగా హ్యాక్ చేయలేరు.


Also read: Diwali Offer: బంపరాఫర్.. కొత్త ఇంటర్నెట్ కనెనక్షన్లపై రూ. 500 డిస్కౌంట్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి