Diwali Offer: బంపరాఫర్.. కొత్త ఇంటర్నెట్ కనెనక్షన్లపై రూ. 500 డిస్కౌంట్

దీపావళి వేళ బీఎస్ఎన్ఎల్ బంపరాఫర్ ప్రకటించింది. కొత్త బ్రాడ్ బ్యాండ్ కనెనక్షన్లు తీసుకునే వారికి రూ. 500 వరకు డిస్కౌంట్ ప్రకటిస్తున్నట్లు తెలిపింది.. పూర్తి వివరాలు ఇక్కడ తెలుపబడ్డాయి

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 3, 2021, 04:51 PM IST
  • దీపావళి వేళ బీఎస్ఎన్ఎల్ బంపరాఫర్ ప్రకటన
  • కొత్త బ్రాడ్ బ్యాండ్ కనెనక్షన్లు తీసుకునే వారికి రూ. 500 డిస్కౌంట్
  • రూ.399 ప్యాకేజీతో కూడిన ఆఫర్ రీలాంచ్ చేసిన బీఎస్ఎన్ఎల్
Diwali Offer: బంపరాఫర్.. కొత్త ఇంటర్నెట్ కనెనక్షన్లపై రూ. 500 డిస్కౌంట్

BSNL Diwali Offer to New Broadband Connections: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) దీపావళి పండగ (Diwali) వేళ బంపరాఫర్ ప్రకటించింది. కొత్తగా బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ తీసుకునే కస్టమర్లకు మొదటి నెల బిల్లుపై దాదాపు రూ.500 మేర డిస్కౌంట్ అందిస్తోంది. అయితే నవంబర్ 21 లోపు యాక్టివేట్ అయిన కొత్త కనెక్షన్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అండమాన్ నికోబార్ మినహా దేశవ్యాప్తంగా ఈ ఆఫర్‌ను బీఎస్ఎన్ఎల్ అందుబాటులోకి తీసుకొచ్చింది.

కరోనా నేపథ్యంలో చాలామంది టెకీలు ఇంటి నుంచే పనిచేస్తుండటం, చాలామంది విద్యార్థులు ఆన్‌లైన్ క్లాసులకు హాజరవుతుండటంతో.. తాజా ఆఫర్‌ వారిని బీఎస్ఎన్ఎల్ వైపు ఆకర్షిస్తుందని సంస్థ భావిస్తోంది. తద్వారా తమ పోటీదారులైన ఎయిర్‌టెల్, రిలయన్స్ జియోలతో పోటీ పడవచ్చునని భావిస్తోంది.

Also Read: Deepavali 2021 Safe Tips: 'దీపావళి' రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ జాగ్రత్తలు మరవద్దు

అలాగే, రూ.399 ప్యాకేజీతో కూడిన ఎంట్రీ లెవల్ ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్‌ను బీఎస్ఎన్ఎల్ తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో ఈ ప్యాకేజీని రద్దు చేసిన బీఎస్ఎన్ఎల్ దీపావళి సందర్భంగా రీలాంచ్ చేసింది. ఈ ప్యాకేజీపై కస్టమర్లకు 30ఎంబీపీఎస్ డౌన్‌లోడ్ స్పీడ్‌తో 1000 జీబీ డేటా వరకు అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ గడువు 90 రోజుల వరకే ఉంటుంది.

ఇక ఇప్పటివరకూ అందుబాటులో ఉన్న రూ.99 మొబైల్ పోస్ట్ పెయిడ్ ప్లాన్‌ను బీఎస్ఎన్ఎల్ రద్దు చేసింది. ఇప్పటివరకూ ఈ ప్యాక్‌ను ఉపయోగిస్తున్న వారంతా ఇక రూ.199 ప్యాక్‌కి మారాల్సి ఉంటుంది. ఈ ప్యాక్‌కి అదనంగా రూ.100 సెక్యూరిటీ డిపాజిట్ కూడా వసూలు చేస్తోంది.

Also Read: Huzurabad by Poll: ఇది అహాంకారానికి-ఆత్మగౌరవానికి జరిగిన పోరాటం..ఈటెల సంచల వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News