Super Girl stolen thief's Scooty: సాంకేతికత పెరుగుతున్నా కొద్ది ప్రజల్లో మార్పులు భారీగా వస్తోంది. గతంలో ఇల్లుదాటి బయటికిరాని మహిళలు ఇప్పుడు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. తమకు ఎదురైన సమస్యలను ఎంతో తెలివిగా ఎదుర్కొంటున్నారు. ఓ ఇద్దరు దొంగలు తమ వస్తువును దొంగిలించాలని చూసినా.. చాలా తెలివిగా వ్యవహరించి వారికే జులక్ ఇచ్చింది ఓ అమ్మాయి. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్కూటీపై వచ్చిన ఇద్దరు దుండగులు ఓ గల్లీలో కాపు కాచి ఆ మార్గం గుండా వెళుతున్న వారి వస్తువులను (మొబైల్, పర్స్, బంగారం) దోచుకోవాలని ప్లాన్ వేశారు. అందులో భాగంగానే ఒక వ్యక్తి మొబైల్‌ను లాక్కోవడానికి ప్రయత్నించారు. స్కూటీపై ఒకరు ఉండగా.. మరొకరు నడుచుకుంటూ వెళుతున్న ఓ వ్యక్తి వద్ద మొబైల్ తీసుకోవడానికి ప్రయత్నించాడు. దొంగ ఆ వ్యక్తి వెనకాలకు రాగానే అతడు మొబైల్ చూసేందుకు చేతిని పైకి ఎత్తుతాడు. దాంతో ఆ దొంగ విఫలమవుతాడు. 


కొంత సమయానికి ఓ అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ వేసుకుని.. చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మొబైల్ చూస్తూ నడుచుకుంటూ రావడాన్ని ఆ ఇద్దరు దొంగలు గమనించారు. ఆ అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ దొంగిలించేందుకు ఒకడు ప్రయత్నించగా.. ఆమె ప్రతిఘటించింది. దాంతో స్కూటీపై ఉన్న ఇంకో దొంగ కూడా వచ్చి అమ్మాయి బ్యాగ్ లాక్కునేందుకు ప్రయతించాడు. ఇక్కడే ఆ అమ్మాయి తెలివిగా ప్రయత్నించింది. తన బ్యాగ్ వదిలేసి దొంగలను పక్కకు నెట్టేసి.. స్కూటీ వేసుకొని వెళ్లిపోయింది. 


అమ్మాయి తమ స్కూటీని తీసుకుపోవడం చూసిన ఆ ఇద్దరు దొంగలు లబోదిబో అన్నారు. స్కూటీ వెనకాల పరుగులు పెట్టారు. ఇందుకు సంబందించిన వీడియోను 'నేషన్.వీడియో' అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా పోస్ట్ చేసింది. ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.  ఈ వీడియోకి ఇప్పటి వరకు వేల సంఖ్యలో వ్యూస్, లైక్‌లు, కామెంట్‌లు వచ్చాయి. 'అమ్మాయి తెలివితేటలు మాములుగా లావుగా', 'సూపర్ గర్ల్' అంటూ కామెంట్లు చేస్తున్నారు. 


Also Read: Petrol Price: బాప్‌రే.. డబుల్ సెంచరీ కొట్టిన పెట్రోల్ ధర! ఎక్కడో తెలుసా?!!


Also Read: Gold Rate Today 27 February 2022: మహిళలకు శుభవార్త.. మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook