RPF Constable Saves Life: రైలు కింద పడబోయిన మహిళను కాపాడిన కానిస్టేబుల్.. వీడియో పోస్ట్ చేసిన రేవంత్ రెడ్డి
RPF Constable saves Woman passenger Life: రన్నింగ్ ట్రైన్ నుంచి దిగబోయి రైలు కిందపడబోయిన ఓ మహిళను ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కాపాడాడు. ఈ ఘటన వరంగల్ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకుంది.
RPF Constable saves Woman passenger in Warangal Railway Station: పోలీసులు దేశానికి ఎంత సేవ చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అహర్నిశలు కస్టపడి దేశ సరిగద్దులోనే కాకుండా ప్రతిచోటా ప్రజలను కాపాడుతుంటారు. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్‌లో కూడా ప్రజలను రక్షిస్తుంటారు. తాజాగా రన్నింగ్ ట్రైన్ నుంచి దిగబోయి రైలు కిందపడబోయిన ఓ మహిళను ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కాపాడాడు. ఈ ఘటన వరంగల్ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే...
వరంగల్ జిల్లా హసన్పర్తి మండలం భీమారానికి చెందిన 53 ఏళ్ల పార్వతి అనే మహిళ 20 మంది కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుపతి వెళ్లారు. తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనం అనంతరం ఆదివారం తిరుపతి నుంచి కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో వరంగల్‌కు బయలుదేరింది. సోమవారం సాయంత్రం కృష్ణా ఎక్స్‌ప్రెస్ వరంగల్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. వెంటనే కుటుంబ సభ్యులు ముందుగా దిగారు. పార్వతి దిగుతున్న సమయంలో రైలు వేగం పుంజుకుంది.
రైలు వేగం పెరిగినా పార్వతి దిగేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో రైలు డోర్ వద్ద వేలాడుతూ రైలు, ప్లాట్‌ఫాం మధ్యలో పడబోయింది. ప్లాట్‌ఫాం విధులు నిర్వర్తిస్తున్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చిన్న రామయ్య ఇది గమనించి.. పార్వతిని చేతులతో పట్టుకుని లాగాడు. దాంతో ఇద్దరు ప్లాట్‌ఫాంపై పడ్డారు. దీంతో పార్వతికి పెద్ద ప్రాణాపాయం తప్పింది. వెంటనే కుటుంబ సభ్యులు వచ్చి ఆమెను పైకి లేపారు. కానిస్టేబుల్ చిన్న రామయ్యకు వారందరూ ధన్యవాదాలు చెప్పారు.
మహిళను కాపాడిన కానిస్టేబుల్ చిన్న రామయ్యకు వరంగల్ రైల్వేస్టేషన్ ఆర్పీఎఫ్ సీఐ కృష్ణ అభినందించారు. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో చిన్న రామయ్యపై ప్రశంసల వర్షం కురుస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా అతడిని అభినందిస్తూ ఓ పోస్ట్ చేశారు. 'వరంగల్ రైల్వే స్టేషన్‌లో ప్రమాదవశాత్తు నడుస్తున్న రైలు కింద జారిపడిపోయిన పార్వతి అనే మహిళను ప్రాణాలకు తెగించి కాపాడిన పీఆర్ఎఫ్ కానిస్టేబుల్ చిన్న రామయ్య గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. రామయ్య.. మీరు నిజమైన హీరో' అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
Also Read: Drunk & Drive Fine: మందుబాబులకు శుభవార్త.. రూ.10వేలు కాదు కేవలం రూ.2 వేలు మాత్రమే! లిమిటెడ్ ఆఫర్
Also Read: Kalavathi Song: డాన్స్ మాస్టర్‌తో మ్యూజిక్ డైరెక్టర్ స్టెప్పులు.. పోలా అదిరిపోలా (వీడియో)!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook