Kalavathi Song: డాన్స్ మాస్టర్‌తో మ్యూజిక్ డైరెక్టర్ స్టెప్పులు.. పోలా అదిరిపోలా (వీడియో)!!

Sekhar and Thaman Dance To Kalaavathi Song: ప్రముఖ డాన్స్ మాస్టర్ శేఖర్‌తో కలిసి మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ కళావతి సాంగ్​కు​ అదిరే స్టెప్పులు వేశాడు. కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్‌కు ధీటుగా  మహేష్ బాబు వేసిన హుక్‌స్టెప్‌ను థమన్ అనుకరించాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 23, 2022, 12:27 PM IST
  • అప్పుడు శ్రీవల్లి.. ఇప్పుడు కళావతి
  • డాన్స్ మాస్టర్‌తో మ్యూజిక్ డైరెక్టర్ స్టెప్పులు
  • స్టెప్పులు పోలా అదిరిపోలా
Kalavathi Song: డాన్స్ మాస్టర్‌తో మ్యూజిక్ డైరెక్టర్ స్టెప్పులు.. పోలా అదిరిపోలా (వీడియో)!!

Sarkaru Vaari Paata Music director S Thaman dance for Kalaavathi Song: 'సూపర్‌ స్టార్‌' మహేశ్‌ బాబు, స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్‌ జంటగా నటిస్తున్న తాజాగా సినిమా 'సర్కారు వారి పాట'. ఫ్యామిలీ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను  మైత్రి మూవీ మేకర్స్, జీఎంబీ ప్రొడక్షన్స్,14 రీల్స్ ఎంటటైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వేసవి కానుకగా ఈ సినిమాను మే 12న విడుదల చేస్తున్నారు. మహేష్ చివరగా నటించిన సినిమా 'సరిలేరు నీకెవ్వరు' భారీ హిట్ కొట్టడంతో.. 'సర్కారు వారి పాట'పై అంతకు మించి అంచనాలు నెలకొన్నాయి. 

'సర్కారు వారి పాట' సినిమా నుంచి ఇటీవలె విడుదలైన ఫస్ట్‌ లిరికల్‌ సాంగ్‌ 'కళావతి' యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. 'ప్రేమికుల దినోత్సవం' సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదలైన ఈ పాట ​ఇప్పటికే 40 మిలియన్‌ వ్యూస్‌తో దుమ్మురేపుతోంది. ఈ పాటపై ఇప్పటికే అనేక మంది​ రీల్స్​ చేసి అలరించారు. మహేశ్​ బాబు కుమార్తె సితార, హీరోయిన్ కీర్తి సురేష్ కూడా కళావతి సాంగ్​పై అదిరిపోయే స్టెప్పులు వేశారు. తాజాగా 'సర్కారు వారి పాట' మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్​ కూడా ఈ జాబితాలో చేరాడు. 

ప్రముఖ డాన్స్ మాస్టర్ శేఖర్‌తో కలిసి మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ కళావతి సాంగ్​కు​ అదిరే స్టెప్పులు వేశాడు. కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్‌కు ధీటుగా  మహేష్ బాబు వేసిన హుక్‌స్టెప్‌ను థమన్ అనుకరించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను తన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. 'సిగ్గుతో.. నన్ను నేనేనా' అని కాప్షన్ ఇచ్చాడు. 'నాతో కలిసి డాన్స్ చేసినందుకు శేఖర్‌ మాస్టర్‌కు ధన్యవాదాలు. సూపర్ స్టార్ మహేష్ గారికి ఇదే నా ప్రేమ' అని పేర్కొన్నాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

కళావతి పాటకు థమన్‌ స్వరాలు అందించగా.. స్టార్ సింగ‌ర్ సిద్ శ్రీరామ్ ఆలపించాడు. ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించాడు. కళావతి పాటలో మహేశ్‌ బాబు లుక్‌, కీర్తి సురేష్ అంద చందాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అందుకే కళావతి మెలోడీ సాంగ్ యూట్యూబ్‌లో రికార్డులను బద్దలు కొడుతోంది. మొన్నటి వరకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' సినిమాలోని 'శ్రీవల్లి', 'ఊ అంటావా మావా' పాటలకు అందరూ స్టెప్పులు వేయగా.. ఇప్పుడు కళావతి వంతు వచ్చింది. కళావతి మేనియా కూడా మరికొన్ని రోజులు కొనసాగనుంది. 

Also Read: గొప్ప మనసు చాటుకున్న టీమిండియా క్రికెటర్.. బాలుడి శస్త్ర చికిత్స కోసం రూ.31 లక్షల విరాళం!!

Also Read: Horoscope Today Feb 23 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అధిక ధన వ్యయం తప్పదు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News