Shocking Viral Video:  సోషల్ మీడియాలో (Social Media) రోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో ఈ మధ్య జంతువులకు సంబంధించిన వీడియోలే ఎక్కువగా ఉంటున్నాయి. ఇందులో కొన్ని ఫన్నీగా ఉంటే, మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఇంకొన్ని వీడియోలయితే మన్నిల్ని భయపెడతాయి. సాధారణంగా పాములు, సింహాలు, పులులు, కోతులకు సంబంధించిన వీడియోలే నెట్టింట ఎక్కువగా హల్ చల్ చేస్తుంటాయి.  మీరు సీ లయన్ లేదా సీల్ చేపలను చూసే ఉంటారు. ఇవీ ఎక్కువగా సముద్రంలోనే జీవిస్తుంటాయి. తాజాగా సీ లయన్ కు సంబంధించిన ఓ వీడియో (Sea lion Video) ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఇందులో సీల్ యెుక్క ప్రవర్తన నెటిజన్లకు తెగ నవ్వు తెప్పిస్తుంది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీడియో ఓపెన్ చేస్తే...ఈక్వెడార్‌లోని గాలాపాగోస్ దీవులలోని బీచ్‌సైడ్ రిసార్ట్‌ ఉంది. ఈ రిసార్ట్ లో సముద్రతీరానికి దగ్గరగా స్విమ్మింగ్ పూల్  ఉంటుంది. ఇందులో కొందరు విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. అయితే ఇది బీచ్ కు దగ్గరగా ఉండటంతో ఓ సీ లయన్ మెట్ల ద్వారా రిసార్ట్ లోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి స్విమ్మింగ్ పూల్ లోకి దూకి ఈత కొడుతుంది. అక్కడే ఓ వీఐపీ స్విమ్మింగ్ పూల్ లాంజ్ చైర్‌పై పడుకుని ఉంటాడు. అతడిని పక్కకు నెట్టి మరీ ఆ సీల్ చేప పడుకుంటుంది. అది చేసిన పనికి పక్కన ఉన్న వారు పగలబడి నవ్వుతారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్  అవుతుంది. ఈ వీడియోను 'వైరల్‌హాగ్' (Viralhug) అనే ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో షేర్ చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోకు 17వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. 


Also Read: Viral Video: వ్యాయామం చేసేందుకు ప్రయత్నించి జారిపడ్డ వ్యక్తి.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G  


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook