Pushpa Srivalli Dance: ఈ తల్లీ బిడ్డల డాన్స్ చూస్తే.. అల్లు అర్జున్ కూడా ఫిదా అవ్వాల్సిందే!!
Mother daughter Srivalli song dance: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉంటున్న ఓ తల్లీ బిడ్డ శ్రీవల్లి పాటకు డాన్స్ ఇదరగదీశారు. తల్లీకూతుళ్లు ఇద్దరు అల్లు అర్జున్ హుక్ స్టెప్‌ను చాలా అద్భుతంగా చేయడంతో వారిని స్టెప్పులకు అందరూ ఫిదా అవుతున్నారు.
Mother and daughter dance Pushpa's Srivalli song: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'పుష్ప: ది రైజ్'. 2021 డిసెంబరు 17న విడుదలైన ఈ సినిమా భారీ హిట్ కొట్టింది. అన్నీ భారతీయ భాషల్లో కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి సాంగ్, డైలాగ్ నెట్టింట వైరల్ అయ్యాయి. దాంతో దేశవ్యాప్తంగా ఏడ చూసినా.. పుష్ప మేనియానే నడుస్తోంది. ఎవరిని కదిలించినా పుష్ప సినిమాలోని 'శ్రీవల్లి', 'ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా' పాటలను రీ క్రియేట్, రీల్స్ రూపొందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ తల్లీ బిడ్డల డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
'పుష్ప: ది రైజ్' సినిమాలోని శ్రీవల్లీ పాటకు సామాన్యుల నుంచి సెలెబ్రెటీల వరకు వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో కొందరి డాన్స్ అందరిని ఆకట్టుకుంది. అయితే ఇప్పటివరకు దాదాపుగా అందరూ సోలోగా చేయగా.. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉంటున్న ఓ తల్లీ బిడ్డ శ్రీవల్లి పాటకు డాన్స్ ఇదరగదీశారు. తల్లీకూతుళ్లు ఇద్దరు అల్లు అర్జున్ హుక్ స్టెప్‌ను చాలా అద్భుతంగా చేయడంతో వారిని స్టెప్పులకు అందరూ ఫిదా అవుతున్నారు.
యూఏఈలో ఉంటున్న ఆర్థోడాంటిస్ట్ నివేదా శెట్టి హెగ్డే, ఆమె ఆరేళ్ల కుమార్తె ఇషాన్వి.. హిందీ వెర్షన్ శ్రీవల్లి పాటకు డాన్స్ చేశారు. తల్లీకూతుళ్లు ఇద్దరు లంగావోణీలో అందంగా ముస్తాబయి.. తన ఇంటి ఆవరణలో అదిరే స్టెప్పులు వేశారు. ఎక్కడ కూడా వారి స్టెప్పులు మిస్ మ్యాచ్ కాలేదంటే.. వారు ఎంతలా ప్రాక్టీస్ చేశారో అర్ధం చేసుకోవచ్చు. చిన్నారి కూడా వావ్ అనిపించింది. వారి డాన్స్ కొరియోగ్రఫీ చాలా బాగుంది. తల్లీ కూతుళ్ల డ్యాన్స్ ఎంత అద్భుతంగా ఉందంటే.. అల్లు అర్జున్ కూడా వీళ్ల డ్యాన్స్ చూస్తే మెచ్చుకోకుండా ఉండలేడు.
ఇందుకు సంబందించిన వీడియోను నివేదా శెట్టి తన తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. 'అద్భుతమైన శ్రీవల్లి పాటకు మా చిన్ని ప్రయత్నం ఇది. ఈ పాటకు ఇలా డ్రెసింగ్ చేసుకుని డాన్స్ చేయడం చాలా ఇష్టం. దీన్ని మీరు కూడా ఆనందిస్తారని ఆశిస్తున్నాము. యూట్యూబ్‌లో ఫుల్ వీడియోను చూడండి. లింక్ ఇదిగో' అంటూ నివేదా శెట్టి ట్వీట్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. తల్లీకూతుళ్ల స్టెప్పులకు అందరూ ఫిదా అవుతున్నారు. వీడియోకి ఇప్పటివరకు 18 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. ఆలస్యం ఎందుకు మీరూ వీడియో చూసి ఎంజాయ్ చేయండి.
Also Read: Aloe Vera Health Benefits: అలోవెరా జ్యూస్ ఆరోగ్యానికి అంత మంచిదా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook