India Playing 11 vs West Indies for 2nd T20: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో ఘన విజయం సాధించిన భారత్.. మరో సమరానికి సిద్దమైంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగానే శుక్రవారం రాత్రి వెస్టిండీస్, భారత్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జారగనుంది. ఇప్పటికే ఓ మ్యాచ్ గెలిచిన రోహిత్ సేన రెండో టీ20 కూడా గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్ గెలిచి సిరీసు రేసులో నిలవాలని పోలార్డ్ సేన భావిస్తోంది. టాస్ సాయంత్రం 6.30 గంటలకు పడనుండగా .. మ్యాచ్ 7 గంటలకు ఆరంభం అవుతుంది. ఈ నేపథ్యంలో టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్‌ను ఓసారి పరిశీలిద్దాం.
ఓపెనర్లుగా రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ బరిలోకి దిగనున్నారు. తొలి టీ20 ఈ ఇద్దరు మంచి శుభారంభం ఇచ్చారు. రోహిత్ బౌండరీల వర్షం కురిపించగా.. ఇషాన్ కాస్త తడబడ్డాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. దాంతో రెండో టీ20లో సత్తాచాటాల్సిన అవసరం ఉంది. ఇషాన్ తుది జట్టులో ఖాయం కావడంతో.. మరో యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌కు నిరాశ తప్పదు. మూడో స్థానంలో విరాట్ కోహ్లీ రానున్నాడు. తొలి టీ20లో నిరాశపరిచిన కోహ్లీ.. ఈ మ్యాచ్‌లోనైనా రాణించాల్సి ఉంది.
మిడిలార్డర్‌లో రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ బరిలోకి దిగనున్నారు. తొలి టీ20లో పంత్ విఫలమవగా.. సూర్య మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. పంత్ ఈ మ్యాచులో చెలరేగాలని మేనేజ్మెంట్ కోరుకుంటోంది. వెంకటేశ్ అయ్యర్ అద్భుతంగా ఆడాడు. సూర్యతో కలిసి చివరివరకు క్రీజులో నిలబడ్డాడు. మిడిలార్డర్‌లో ఈ ముగ్గురు రాణిస్తే టీమిండియాకు తిరుగుండదు. ఇక జట్టులో చోటు ఆశిస్తున్న శ్రేయాస్ అయ్యర్‌కు మరోసారి నిరాశ తప్పేలా లేదు.
తొలి టీ20లో గాయపడిన పేసర్ దీపక్ చహర్.. రెండో టీ20కి దూరం కానున్నాడు. కీరన్ పొలార్డ్ కొట్టిన షాట్‌ను ఆపే క్రమంలో చహర్ కుడి చేతికి గాయం కావడంతో తన కోటా ఓవర్లు పూర్తి కాకుండానే డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడు. గాయం తీవ్రతపై సమాచారం లేకపోయినా.. ముందస్తు జాగ్రత్తలో భాగంగా అతడికి రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. చహర్ స్థానంలో ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ జట్టులోకి రానున్నాడు. పేస్ కోటాలో భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్.. స్పిన్ విభాగంలో రవి బిష్ణోయ్, యుజ్వేంద్ర చాహల్‌లు కొనసాగనున్నారు.
భారత్ తుది జట్టు (అంచనా):
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్, దీపక్ చహర్/ శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్.
Also Read: Simon Katich SRH: సన్‌రైజర్స్‌కు భారీ షాక్.. సరైన జట్టును కొనుగోలుచేయలేదని జట్టును వీడిన కోచ్!!
Also Read: Samantha Dance: విజయ్ పాటకు ముందు పూజా హెగ్డె.. ఆ తర్వాత సమంత! పోటాపోటీ స్టెప్పులు అదిరాయి!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook