Video Trending in Google Discover: ప్రతి జీవికి నీరు అవసరం. ఇప్పటికీ మన దేశంలో చాలా మంది మంచి నీళ్లను ఎన్నో మైళ్లు నడిచి తెచ్చుకుంటూ ఉంటారు. ఎండా కాలం వచ్చిందంటే నీటి అవసరం మరింత పెరుగుతుంది. ఈ ఏడాది ఎండలు మండిపోతున్నాయి. పగటి పూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదు అవుతున్నాయి. ఈ వేడి తీవ్రతకు మనుషులే అల్లాడిపోతున్నారు. అలాంటిది జంతువుల గురించి వేరేగా చెప్పాలా. గుక్కెడు నీరు కోసం యానిమల్స్ తీవ్ర ఆగచాట్లు పడుతున్నాయి. బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉండాలంటే నీరు చాలా అవసరం. అందుకే నిపుణులు సమ్మర్ లో ఎక్కువగా వాటర్ తీసుకోమని సిఫార్సు చేస్తారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోషల్ మీడియాలో రోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇందులో కొన్ని వీడియోలు షాక్ కు గురిచేస్తే.. మరికొన్ని ఆలోచింప జేస్తాయి. తాజాగా ఓ మనిషి ఉడుతకు నీరు అందించి మానవత్వాన్ని చాటుకున్న వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.  వీడియో ఓపెన్ చేస్తే..  చెట్టు కొమ్మపై ఓ ఉడుతకు తీవ్ర దాహం వేస్తోంది. అంతలోనే ఓ వ్యక్తి బాటిల్ తో నీరు తీసుకుని దాని దగ్గరకు వెళ్తాడు. ఉడుత నోటి దగ్గర బాటిల్ పెడితే గబగబ తాగేస్తోంది. దీంతో ఆ వ్యక్తి ఆశ్చర్యానికి గురవుతాడు. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కొందరి చూడటానికి ఈ దశ్యం చాలా బాగుందని అంటుంటే.. మరికొందరు ఆ వ్యక్తిపై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. ఈవీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నందా ట్విట్టర్ లో పోస్టు చేశారు. 



Also Read: Viral Video: ఇదేందయ్యా ఇది..నేనెప్పుడూ చుడలే..! పామును తిన్న జింక, వీడియో వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి