Viral Video Today: సోషల్ మీడియాలో రోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఈ మధ్య ఎక్కువగా జంతువులకు సంబంధించిన వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి. ఇందులో కొన్ని ఫన్నీగా ఉంటే, మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. మనందరికీ ఒరంగుటాన్ (Orangutan) గురించి తెలిసే ఉంటుంది. ఒరంగుటాన్ (Orangutan) అనేది ఒక క్షీరదము. ఇవి కూడా కోతులు మాదిరిగానే ఉంటాయి, కానీ వీటికి పొడవాటి చేతులు ఉంటాయి.  చెట్లపై నివసించే జంతువులలో ఒరాంగుటాన్లే అత్యంత పెద్దవి. ఇవీ ఎక్కువగా బోర్నియో, సుమాత్రా ద్వీపాల్లోని ఉష్ణమండల అడవుల్లో నివసిస్తుంటాయి. తాజాగా ఒరంగుటాన్ కు సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వియత్నాంలోని హో చి మిన్ సిటీలోని సైగాన్ జూ లో ఒక మగ ఒరంగుటాన్ తన ఎన్‌క్లోజర్‌లో కూర్చుని సిగరెట్ తాగుతూ (Orangutan smoking Video) ఉంటుంది. ఈ పెద్ద కోతి మనుషుల మాదిరిగానే సిగరెట్ ను పట్టుకుని దమ్ము కొడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "ప్రజలు తరచుగా వస్తువులను జంతువుల బోనుల్లోకి విసిరివేస్తారు మరియు ఒరంగుటాన్ ఈ వస్తువులను ప్రజలు ఎలా ఉపయోగిస్తారో చూడటం ద్వారా వాటిని ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటుంది" అని జూ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఈ వీడియో జంతు ప్రేమికులకు కోపం తెప్పించింది. సామాజిక మాధ్యమాల ద్వారా వీరు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


Also Read: Viral Video: బుల్డోజర్‌తో 100 బైక్‌లను తొక్కించిన మేయర్.. కారణం ఏంటో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook