Snake in Scooty: హిందూ సంప్రదాయంలో నాగుపాములకు చాలా విశిష్టమైన స్థానం ఉంది. మన దేశంలో వీటిని దైవంగా కొలుస్తారు. నాగుపాములకు సంబంధించిన ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి కూడా. అయితే వీటిని పక్కన పెడితే ఇవి చాలా విషపూరితమైన పాములు. వీటి విషం కొన్ని నిమిషాల్లో మనిషిని చంపేస్తుంది. ఈ పాములు ఎక్కువగా భారత ఉపఖండానికి మాత్రమే పరిమితమైనవి. అయితే ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా ఇట్టే తెలిసిపోతుంది. ఈ మధ్య జంతువులకు సంబంధించిన వీడియోలు.. ముఖ్యంగా స్నేక్స్ వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.  తాజాగా ఓ నాగుపాము స్కూటీలో దూరి భయభ్రాంతులకు గురి చేసింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి మరి. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీడియో ఓపెన్ చేస్తే.. ఇందులో ఓ నాగుపాము స్కూటీ (Snake in Scooty) మందు భాగంలో దూరింది. ఇది చాలా పొడవు ఉంది. దానిని బయటకు తీసేందుకు స్కూటీ యాజమాని స్నేక్ క్యాచర్ ను పిలుస్తాడు. అతడు స్కూటీ ఫ్రంట్ భాగాన్ని విప్పి ఆ పామును నెమ్మెదిగా బయటకు తీస్తాడు. అది బుసలు కొడుతూ ఉంటుంది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. స్నేక్ ను చాకచాక్యంగా బయటకు తీసిన వ్యక్తిపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోను నలభై వేలకు మందికి పైగా వీక్షించగా, దాదాపు వెయ్యి మంది లైక్ లు చేశారు.  Susanta Nanda అనే ట్విట్టర్ పేజీలో ఈ వీడియో షేర్ చేయబడింది. 


Also read: White king Cobra: 20 అడుగుల రేర్ వైట్ కింగ్ కోబ్రాని చూసారా..? చూస్తే గూస్ బంప్స్ పక్కా.. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook