White king Cobra: 20 అడుగుల రేర్ వైట్ కింగ్ కోబ్రాని చూసారా..? చూస్తే గూస్ బంప్స్ పక్కా..

Very Rare White Cobra Snake Video Viral:  శ్వేత నాగు వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, దాన్ని పట్టుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. 

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 15, 2022, 08:01 AM IST
White king Cobra: 20 అడుగుల రేర్ వైట్ కింగ్ కోబ్రాని చూసారా..? చూస్తే గూస్ బంప్స్ పక్కా..

Very Rare White Cobra Snake Video Viral: కొన్నాళ్ల క్రితం తెలుగులో విడుదలైన శ్వేత నాగు సినిమా ఎంత సూపర్ హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సౌందర్య హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో శ్వేత నాగు చుట్టూనే కథనం అంతా తిరుగుతూ ఉంటుంది. అప్పట్లో ఈ సినిమా తెలుగులో మాత్రమే కాకుండా కన్నడ సహా పలు ఇతర భాషల్లోకి కూడా విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది.

అంతేకాక ఈ సినిమా మంచి కలెక్షన్ల వర్షం కూడా కురిపించింది. ఇప్పుడు సరిగ్గా ఆ సినిమాలో ఉన్న లాంటి శ్వేతనాగుని పోలి ఉన్నట్టుగా ఉన్న శ్వేత నాగు వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో పామును పట్టుకునేందుకు పలువురు ప్రయత్నిస్తూ ఉండగా అది ముందు కలుగులో దూరుతుంది. కలుగులో దూరిన తర్వాత దాన్ని ఎలాగో బలవంతంగా బయటికి తీసుకువచ్చి అక్కడ పొలంలో వదులుతారు ఆ వ్యక్తులు.

ఈ సమయంలో అక్కడే ఉన్న నీళ్లలో ఆ పాము ఈదుతూ ముందుకు వెళుతున్నట్లుగా ఉన్న ఒక వీడియో వైరల్ అయింది. యూట్యూబ్ లో ఈ వీడియో షేర్ చేసిన తక్కువ కాలంలోనే దీనికి మంచి వ్యూస్ అలాగే లైక్స్ కూడా వచ్చాయి. ఇక ఈ వీడియో చూసిన వారందరూ ఔరా అంటూ కామెంట్ చేస్తున్నారు. శ్వేత నాగు అంటే ఇలా ఉంటుందా? అని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. శ్వేతనాగు సినిమాలో చూపించినవన్నీ గ్రాఫిక్స్ కాగా ఈ పాము నిజంగా కూడా ఉంటుందా? అని పలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

నిజానికి ఈ వీడియోలో పాముకి రంగు వేశారు అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు. నిజంగా ఇలాంటి తెల్ల పాములు ఉంటాయా? అని కూడా వారందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మొత్తం మీద ఈ శ్వేత నాగు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మరి మీరు కూడా ఈ శ్వేత నాగు వీడియోని ఒకసారి చూసేయండి మరి. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News