World tallest and shortest men meet video: వినూత్నంగా ఉన్న ఏ వీడియో అయినా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అయిపోతుంది. అయితే తాజాగా గిన్నీస్ వరల్డ్ రికార్డు సంస్థ ఓ పాత వీడియోను షేర్ చేసింది. ప్రపంచంలోనే అతి పొడవైన వ్యక్తి, అతి పొట్టి వ్యక్తి కలిసిన అరుదైన వీడియో అది. ఇది కాస్తా ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ గా మారింది. అసలు ఈ వీడియోను GWR సంస్థ ఇప్పుడు ఎందుకు పోస్ట్ చేసిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచంలోనే అత్యంత పొడవైన వ్యక్తి  టర్కీకి చెందిన సుల్తాన్ కోసెన్. ఇతని ఎత్తు 8 అడుగుల, 3 అంగుళాలు. ఇతను 2009లో వరల్డ్ లోనే టాలెస్ట్ మ్యాన్ గా నిలిచాడు. రీసెంట్ గా (డిసెంబరు 10) ఇతడు 41వ ఒడిలోకి అడుగుపెట్టాడు. అతని పుట్టిన రోజును పురస్కరించుకుని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ (GWR) సంస్థ ఓ అరుదైన వీడియోను షేర్ చేసి బర్త్ డే విషెస్ చెప్పింది. 2014లో లండన్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో ప్రపంచంలోనే అత్యంత పొడవైన వ్యక్తి గా పిలువబడే సుల్తాన్ కోసెన్.. వరల్డ్ లోనే అత్యంత పొట్టి వ్యక్తిగా నిలిచిన డాంగిని కలుసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. 



టర్కీకి చెందిన కోసెన్ పార్ట్ టైమ్ రైతు. పిట్యూటరీ జిగాంటిజం అనే దాని కారణంగా కోసెన్ భారీగా ఎత్తు పెరిగాడు. అతడు బాస్కెట్ బాల్ నెట్ కు సమాన ఎత్తులో ఉంటాడు. నేపాల్ కు చెందిన చంద్ర బహదూర్ డాంగి ఎత్తు 251 సెంటీమీటర్లు కాగా.. బరువు కేవలం 32 పౌండ్లు. ఇతను 2015లో 75 సంవత్సరాల వయస్సులో మరణించాడు. డాంగి ఒక ఆదిమ మరగుజ్జు. ఇలాంటి వారు 30 ఏళ్ల కంటే ఎక్కువ బతకరు. అలాంటిది డాంగీ 75 సంవత్సరాలు వరుకు జీవించాడు. 


Also Read: Viral News: దిమిలి గ్రామంలో జరిగే బురద జాతర ప్రత్యేకత..ఈ జాతర వెనుక ఉన్న పెద్ద సైన్స్‌ ఇదే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి