Viral News: భారతదేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికీ ప్రాచీన సాంప్రదాయాలను పాటించడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో ప్రజలు వింత సాంప్రదాయాలను అనుసరిస్తూనే వస్తున్నారు. భారతదేశంలోని చాలా వరకు అన్ని దేశాల వారు జీవిస్తారు. కాబట్టి వారు పాటించే సాంప్రదాయ, ఆచారాలు ఇతర ప్రజలు కూడా సులభంగా అలవాటు చేసుకుంటారు. బ్రిటిష్ కాలంలోని వారు అనుసరించిన పద్ధతులు కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ ప్రజలు అనుసరిస్తూనే ఉన్నారు. అయితే పూర్వీకుల ఆచార సాంప్రదాయాల ప్రభావం ఎక్కువగా పల్లె ప్రాంతాలవాసులవారిపై పడింది.
దీని కారణంగా పూర్వికులు అనుసరించిన ఆచారాల్లో నగరాల్లో మార్పులు వచ్చినప్పటికీ పల్లె ప్రాంతాల్లో రాలేకపోయారు. మనం తరచుగా సోషల్ మీడియాలో వింత ఆచారాలకు సంబంధించిన వీడియోలు చూస్తూ ఉంటాం. అయితే ఇటీవలే ఓ గ్రామంలో అనుసరిస్తున్న వింత ఆచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
అనకాపల్లి జిల్లాలోని దిమిలిలో జరిగే బురద మాంబా జాతర ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ జాతరను దిమిలి గ్రామస్తులు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ రెండేళ్లకోసారి జరుపుకునే జాతరను అక్కడి ప్రజలు బురద జాతర అని కూడా పిలుస్తారు. ఈ బురద జాతరలో భాగంగా గ్రామస్తులంతా ఎంతో ఆనందంతో పాల్గొంటారు. అయితే పూర్వీకుల నుంచి వస్తున్న ఆనవాయితీ ప్రకారం బురదమాంబాగా పిలిచే అమ్మవారిని ఊళ్లోకి స్వాగతించే క్రమంలో కొన్ని పూర్వికులు అనుసరిస్తున్న పద్ధతులను పాటిస్తారు.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
జాతర రోజు ఉదయాన్నే ఊరంతా డప్పుల చెప్పుల మధ్య బురద ప్రదేశానికి వెళ్లి బురదను ఊరేగింపుగా తీసుకువస్తారు. వేప కొమ్మలను చేతిలో పట్టుకొని ఎంతో ఆనందంగా బురదను ఒకరిపై ఒకరు చల్లుకుంటూ ఉత్సాహంగా ఈ పండగను నిర్వహిస్తారు పూర్వీకుల ప్రకారం బురదను రాసుకోవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని ముఖ్యంగా చర్మవ్యాధులు తొలగిపోతాయని.. ఆ బురదమాంబా ఆశీస్సులు ఉంటాయని ప్రజల నమ్మకం. అంతేకాకుండా బురదను పట్టుకొని డప్పుల చప్పుల్ల మధ్య గ్రామం మొత్తం తిరుగుతూ కనిపించిన వారికి బురదను చల్లుతూ ఎంతో ఆనందంగా ఈ పండగను జరుపుకుంటారు.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి