New Car reaches home and runs into a row of parked bikes: ప్రతి ఒక్కరు కొత్త వాహనం కొంటే.. దాన్ని బాగా అలంకరించి గుడి వద్దకు తీసుకెళ్లి పూజ చేయిస్తారు. ఆపై ఆ వాహనాన్ని ఎంతో అపురూపంగా చూసుకుంటుంటారు. చిన్న మరక పడినా.. వెంటనే క్లీన్ చేస్తుంటారు. వాహనాన్ని చాలాచాలా జాగ్రత్తగా ఉపయోగిస్తుంటారు.   ఈ క్రమంలోనే ఓ వ్యక్తి కొత్త కారును కొని దానికి దండ వేసి మరీ ఇంటికి తీసుకొచ్చాడు. ఇక గేటు లోపలి రాగానే కారుకు ఎవరూ ఊహించని రీతిలో గొప్ప వెల్‌కమ్ లభించింది. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీడియో ప్రకారం.. కొత్త టాటా నెక్సాన్ కారు ఓ అపార్ట్ మెంట్ ముందు వచ్చి ఆగింది. కారులోని ఓ వ్యక్తి కిందకు దిగి వచ్చి అపార్ట్ మెంట్ ముందు ఉన్న గేటును ఓపెన్ చేశాడు. ఇంతలో సెక్యూరిటీ గార్డ్ వచ్చి గేటు తీసిన వ్యక్తికి నమస్కారం చేశాడు. ఇక దండతో ఉన్న కొత్త నెక్సాన్ కారు రోడ్డు మీద నుంచి లోపలికి వచ్చింది. అయితే పార్కింగ్ ప్లేస్‌లో ఆగి ఉన్న బైక్‌లపైకి దూసుకెళ్లింది. దాంతో కారు బోల్తా పడేంత పనైంది. బైక్‌లపైకి ఎక్కిన కారు కిందకు మీదకు పడుతూ చివరకు ఆగింది.


కొత్త టాటా నెక్సాన్ కారు బైక్‌లపైకి దూసుకెళ్లడం చూసిన వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చాడు. అయ్యో అయ్యో అనుకుంటూ సెక్యూరిటీ గార్డ్ కూడా లగెత్తాడు. చివరకు కారు ఆగడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. ఒక సైడ్ ఒరిగిన కారును వారును సరిచేశారు. అనంతరం లోపల ఉన్న వ్యక్తి బయటిక్ దిగాడు. ఇక బైక్‌లపైకి ఎక్కిన కారుకు చిన్న డామేజ్ కూడా కాలేదు కానీ.. బైక్‌లు మాత్రం పాడయ్యాయి. 



ఈ వీడియోను వినోద్ కుమార్ (Sqn Ldr Vinod Kumar (Retd)) తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. సీసీ ఫుటేజీలో కనిపిస్తున్న ప్రకారం ఈ ఘటన గురువారం సాయంత్రం జరిగింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో మాత్రం తెలియరాలేదు. ఈ వీడియోపై నెటిజన్లు విపరీతంగా నవ్వుకుంటున్నారు. అదే సమయంలో లైకుల, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కొత్త కారుకు గొప్ప వెల్‌కమ్, ఎంట్రీ అదిరిపోయిందిగా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 


Also Read: Telangana BJP: పదవులు వద్దంటూ హైకమాండ్ కు లేఖలు.. తెలంగాణ బీజేపీలో కలకలం


Also Read: Adah Sharma Hot Photos: ఆదా శర్మ హాట్ ట్రీట్.. ఎద అందాలు ఆరబోస్తూ వలపు వల!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.