Telangana BJP: పదవులు వద్దంటూ హైకమాండ్ కు లేఖలు.. తెలంగాణ బీజేపీలో కలకలం

Telangana BJP: తెలంగాణ బీజేపీలో కొత్త కలకలం నెలకొంది.ఇంచార్జ్ పోస్టు నుంచి తొలగించాలంటూ కొందరు నేతలు ఏకంగా పార్టీ హైకమాండ్ కు లేఖలు రాశారు.ఈ పరిణామాలతో అప్రత్తమైన బండి సంజయ్.. నేతలను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది

Written by - Srisailam | Last Updated : Oct 9, 2022, 10:45 AM IST
Telangana BJP: పదవులు వద్దంటూ హైకమాండ్ కు లేఖలు.. తెలంగాణ బీజేపీలో కలకలం

Telangana BJP: మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో మునిగిపోయిన తెలంగాణ బీజేపీలో కొత్త కలకలం నెలకొంది. తమకు పదవులు వద్దంటూ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ లు మొత్తుకుంటున్నారు. ఇంచార్జ్ పోస్టు నుంచి తొలగించాలంటూ కొందరు నేతలు ఏకంగా పార్టీ హైకమాండ్ కు లేఖలు రాశారు. ఈ పరిణామాలు తెలంగాణ బీజేపీలో కలకలం రేపుతున్నాయి. ఎక్కడైనా పార్టీలో పదవులు ఇస్తామంటే నేతలు సంబర పడతారు. కాని తమకు ఇచ్చిన ఇంచార్జ్ పదవులు వద్దంటూ నేతలే ప్రాదేయపడటం చర్చగా మారింది. దీనికి అంతటికి పార్టీ ఇంచార్జ్ సునీల్ బన్సల్ చేసిన ప్రకటనే కారణమైంది.

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ.. ఇందుకోసం ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు. తాజాగా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు ఇంచార్జులను ప్రకటించారు బండి సంజయ్.అయితే నియోజకవర్గ ఇంచార్జులుగా స్థానిక నేతలకు కాకుండా ఇతర ప్రాంతాల నేతలను నియమించారు. ఇంచార్జులంతా నియోజకవర్గంలోనే ఉండి పార్టీ బలోపేతం కోసం పని చేయాలి. ఇంచార్జులుగా నియమించబడిన నేతలంతా సంతోషించారు. తమను పార్టీ గుర్తించి పదవి ఇచ్చిందని సంబరపడ్డారు. అయితే ఆ నేతలకు తాజాగా షాకిచ్చారు పార్టీ ఇంచార్జ్ సునీల్ బన్సల్. కొత్తగా నియమితులైన ఇంచార్జులతో సమావేశమైన బన్సల్.. ఇంచార్జులకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వబోరని బాంబ్ పేల్చారు. నియోజకవర్గంలోనే ఉండి.. పార్టీ అభ్యర్థిని గెలిపించడమే వాళ్ల టార్గెట్ అని చెప్పారు.

సునీల్ బన్సల్ చేసిన ఈ ప్రకటనే ఇప్పుడు తెలంగాణ బీజేపీలో కలకలం రేపుతోంది. బన్సల్ ప్రకటనతో ఇంచార్జులుగా నియమించబడిన నేతలంతా ఉలిక్కిపడ్డారు. ఇంచార్జులకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వొద్దన్న రూల్ ఉంటే.. తమకు ఈ పదవే వద్దంటూ ఓపెన్ గానే చెప్పేస్తున్నారు. తమను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించాలని ఏకంగా హైకమాండ్ కు లేఖలు రాస్తున్నారు. కొత్తగా నియమించిన 119 మంది ఇంచార్జులు బండి సంజయ్ టీమ్ నేతలే అంటున్నారు.వీళ్లంతా వచ్చే ఎన్నికల్లో టికెట్ పై ఆశలు పెట్టుకున్నవారే. ఇంచార్జ్ కు నియమించడంతో తమ పంట పడిందని భావించిన నేతలు.. సునీల్ బన్సల్ ప్రకటనతో అవాక్కయ్యారని తెలుస్తోంది. నియోజకవర్గంలో తిరుగుతూ పోటీకి దూరంగా ఉండాలని చెప్పడం ఏంటని మధనపడిపోతున్నారు. తమకు ఇంచార్జి పదవి అక్కర లేదని అధిష్టానానికి లేఖలు రాస్తున్నారు. ఈ పరిణామాలతో అప్రత్తమైన బండి సంజయ్.. నేతలను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.

Also Read : Hyderabad Rain Alert: కుండపోత వానతో హైదరాబాద్ జలమయం.. మరో రెండు రోజులు డేంజరే!

Also Read : Today Gold Rate: దిగిరాని పసిడి, వెండి ధరలు.. హైదరాబాద్ లో తులం బంగారం ఎంతంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News