Group of men in cars repeatedly harass two womens in uttarkhand: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల భద్రతకు అనేక చట్టాలు తీసుకొస్తున్నాయి. అయిన కూడా మహిళలు, యువతులపై దాడులు మాత్రం ఆగడంలేదు. ఈ నేపథ్యంలో.. నిర్బయ, పోక్సో వంటి కఠిన చట్టాలు తీసుకొచ్చిన కామంధులు మాత్రం వెనక్కు తగ్గడంలేదు. పసి పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు ఎవర్ని వదలడంలేదు. బస్టాండ్, రైల్వేస్టేషన్ , గుడి, బడి, ఆఫీస్ ఇలా ప్రతిచోట కూడా మహిళలు వేధింపులకు గురౌతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రులు సైతం కొన్ని చోట్ల దారుణాలకు పాల్పడుతున్నారు.ఈ నేపథ్యంలో రాత్రిపూట బైటికి వెళ్లి, స్కూటీ మీద ఇంటికి వస్తున్న అమ్మాయిల పట్ల కొంత మంది కామాంధులు వేధింపులకు పాల్పడ్డారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 


పూర్తి వివరాలు..
 


కోల్ కతా ఘటన దేశాన్ని కుదిపేస్తుందని చెప్పుకొవచ్చు. ఇది చాలదన్నట్లు మహారాష్ట్రలోని బద్లాపూర్ లో జరిగిన ఘటన కూడా నాలుగేళ్ల చిన్నారులపై స్కూల్లో స్వీపర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన కూడా అగ్గికి ఆజ్యం పోసేవిగా మారింది. ఇప్పటికే కోల్ కతా ఘటనపై దేశ ప్రధాని, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం స్పందించారు. అంతేకాకుండా..ఈ ఘటనను ఏకంగా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. దీనిపై ఇప్పటికి కూడా దేశంలో నిరసనలు మిన్నంటాయి.


ఇదిలా ఉండగా.. ఉత్తరాఖండ్ లోని హల్ద్వాలీలో లోజరిగిన ఘటన వైరల్ గా మారింది. స్థానికంగా ఇద్దరు యువతులు.. మూవీ చూసి తమ బండి మీదకు ఇంటికి వెళ్తున్నారు. ఇంతలో రెండు కార్లలో కామాంధులు మహిళల్ని ఫాలో అయ్యారు. అంతేకాకుండాయువతుల్ని అడ్డుకునే ప్రయత్నం సైతం చేశారు.  రోడ్డుకు అడ్డంగా వారి వాహానాలు పెట్టే ప్రయత్నం సైతం చేశారు. అప్పుడు.. కొంత మంది అటుగా రావడంతో వాళ్లను వదిలేసి ఆకతాయిలు వెళ్లిపోయారు.


Read more: Himanta biswa: మమతా నీకేంత ధైర్యం.. మమ్మల్ని బెదిరిస్తావా..?.. ఎక్స్ లో రెచ్చిపోయిన సీఎం హిమంత బిశ్వశర్మ..


యువతులు.. తమ ఫోన్ లలో ఈ ఘటనను రికార్డు చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు నిందితులపై కఠిన చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేస్తున్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. దుండగుల్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook