Guinness World Records: గిన్నీస్ రికార్డ్.. ఇతని నోరు ఎంత పెద్దదంటే.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టడం ఖాయం...
Guinness World Records: అమెరికాకు చెందిన ఓ టీనేజర్ ప్రపంచంలోనే అతిపెద్ద మౌత్ గేప్ను కలిగి ఉన్నందుకు గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కాడు. ఇంతకీ ఏంటీ మౌత్ గేప్...
Guinness World Records: పెద్ద నోరు... ఇదే ఇప్పుడు అమెరికాకు చెందిన ఓ టీనేజర్‌ను గిన్నీస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కేలా చేసింది.పెద్ద నోరంటే.. నోరేసుకుని పడిపోవడమనుకునేరు. నిజంగా పెద్ద నోరే. ఎంత పెద్ద నోరంటే... ఒకేసారి ఆ నోట్లో నాలుగు బర్గర్స్ పట్టేంత. అమెరికాలోని మిన్నెసొటాకి చెందిన ఇసాక్ జాన్సన్ అనే టీనేజర్ తన పెద్ద నోరుతో గిన్నీస్ రికార్డుల్లో చోటు సంపాదించుకున్నాడు.
ఇసాక్ మౌత్ గేప్ 10.196 సెం.మీ (4.014 అంగుళాలు). అంటే అతను నోరు తెరిస్తే అతని పై దవడకు, కింది దవడకు మధ్య అంత స్పేస్ ఉంటుంది. ఒకేసారి నాలుగు బర్గర్స్ లేదా ఒక పెద్ద బత్తాయి పండును సులువుగా నోట్లో పెట్టేసుకోగలడు. ఇసాక్ తాజా రికార్డుతో తన పాత రికార్డులను తానే బద్దలు కొట్టినట్లయింది. ఇప్పటివరకూ 3 సార్లు తన రికార్డును తానే బద్దలు కొట్టుకున్నట్లు ఇసాక్ తెలిపాడు.
గిన్నీస్ రికార్డ్స్‌లో ఇలా ఒక రికార్డులో తాను మొదటిస్థానంలో ఉంటానని ఎప్పుడూ ఊహించలేదని ఇసాక్ పేర్కొన్నాడు. ఇలా మౌత్ గేప్‌తోనూ రికార్డు సృష్టించవచ్చునని మొదటిసారి 2015లో గ్రహించానని తెలిపాడు. ఇంట్లో రోజూ ఉపయోగించే చిన్న చిన్న వస్తువులు లేదా తినే వస్తువులను నోట్లో పెట్టుకుని ఎంతమేర తాను నోటిని సాగదీయగలనో ప్రాక్టీస్ చేస్తుండేవాడినని చెప్పుకొచ్చాడు. ఇసాక్ మౌత్ గేప్ రికార్డు వీడియోని గిన్నీస్ రికార్డ్స్ యూట్యూబ్ ఛానెల్ పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది.
Also Read: ఆరోజు అసలు జరిగింది ఇదే.. నేను అక్కడే ఉన్నా.. అసలు విషయం చెప్పేసిన బండి సంజయ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook