Seal Dog Viral Video: కుక్కతో పోటీపడిన సముద్రంలోని సీల్‌.. వీడియో చూస్తే అస్సలు నమ్మలేరు!

Viral Video, Man plays with dog and seal in Sea. ఓ కుక్క సముద్రంలోని సీల్‌తో సరదాగా ఆడుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Sep 7, 2022, 01:19 PM IST
  • కుక్కతో పోటీపడిన సముద్రంలోని సీల్‌
  • వీడియో చూస్తే అస్సలు నమ్మలేరు!
  • కుక్కను సీల్‌ అనుకరించడం నవ్వులు పూయిస్తోంది
Seal Dog Viral Video: కుక్కతో పోటీపడిన సముద్రంలోని సీల్‌.. వీడియో చూస్తే అస్సలు నమ్మలేరు!

Man plays with dog and seal in Sea: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఎక్కువగా మనుషులు, జంతువులకు సంబందించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతుంటాయి. చిరుత, సింహం, ఏనుగు, మొసలి, కోతి, పిల్లి, కుక్క, పాములకు సంబందించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు భయంకరంగా ఉంటే.. మరికొన్ని సంబ్రమాశ్చర్యానికి గురిచేస్తాయి. ఇంకొన్ని వీడియోలు చాలా చాలా ఫన్నీగా ఉంటాయి. అలాంటి వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ కుక్క సముద్రంలోని సీల్‌తో సరదాగా ఆడుకుంది. 

వైరల్ వీడియో ప్రకారం.. ఒక వ్యక్తి తన పెంపుడు కుక్కతో కలిసి బీచ్‌కు వెళతాడు. వ్యక్తి బంతిని సముద్రంలోకి విసరగా.. దాన్ని తెచ్చేందుకు కుక్క నీటిలోకి పరుగెత్తుతుంది. బంతిని అందుకుని తన యజమాని వద్దకు తెస్తుంది. అయితే ఆ వ్యక్తి బంతి విసరాగానే సముద్రంలోని సీల్‌ కూడా కుక్కతో పోటీ పడుతుంది. అయితే వేగంగా పరుగెత్తిన కుక్క.. బంతిని అందుకుని యజమాని వద్దకు వస్తుంది. ఈ సమయంలో కుక్కను సీల్‌ అనుకరించడం నవ్వులు పూయిస్తోంది. 

ఇందుకు సంబందించిన వీడియోను 'బ్యూటెంగేబిడెన్' అనే ట్విట్టర్‌లో ఖాతాలో షేర్ చేశారు. 'కుక్కలతో ఆడుకుంటున్నా' అని క్యాప్షన్ పెట్టారు. డేవ్ నెల్సన్ ఈ వీడియో తీసినట్టు పేర్కొన్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. ఈ వీడియోకు ఇప్పటికే 883 వేల వ్యూస్ వచ్చాయి. అదే సమయంలో కామెంట్ల వర్షం కురుస్తోంది. 'సీల్‌ సూపర్' అని ఒకరు కామెంట్ చేయగా.. 'ఫన్నీ మూమెంట్' అని ఇంకొకరు ట్వీట్ చేశారు. 

Also Read: ప్రెస్‌మీట్‌లో పాల్గొనేటప్పుడు ఆ మాత్రం కూడా తెలియదా.. రిపోర్టర్‌పై హీరోయిన్ ఫైర్‌!

Also Read: kids in Car Boot: కారు డిక్కీలో పిల్లలు.. షాక్ ఇచ్చిన ట్రాఫిక్ పోలీసులు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News