Huge crocodiles: వామ్మో.. ఇళ్లలోకి చొరబడుతున్న పెద్ద పెద్ద మొసళ్లు.. ఎక్కడో తెలుసా..?.. వీడియో వైరల్..
Gujarat floods: కొన్నిరోజులుగా భారీ వర్షాలు గుజరాత్ ను అల్లకల్లోలం చేస్తున్నాయి. వర్షాల వల్ల జన జీవనమంతా అస్తవ్యస్తంగా మారిపోయింది. రోడ్లన్ని జలమయమైపోయాయి. ఈ నేపథ్యంలో భారీ మొసళ్లు ఇళ్లలోనికి చేరుకుంటున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.
Crocodiles halchal in Gujarat heavy rains effect: కొన్నిరోజులుగా దేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావం, ద్రోణి వల్ల కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. గంటకు 50 నుంచి 60 కిమీ. ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనజీవనమంతా అస్తవ్యస్తంగా మారిపోయింది. రోడ్లన్ని జలమయమైపోయాయి. వడోదరతో పాటు.. అనేక జిల్లాలలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ప్రభావానికి బైటకు రాలేక జనాలు తెగ ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా.. లోతట్టు ప్రాంతాలన్ని జలమయమైపోయాయి.
కొన్ని ప్రాంతాలలో చెరువులు ,నదులు పొండిపోర్లుతున్నాయి. వీటిలో నుంచి వస్తున్న నీళ్ల వల్ల.. అక్కడ ఉన్న ఇళ్లన్ని మునిగిపోతున్నాయి. ఇదిలా ఉండగా.. ఒక వైపు వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్న జనాలకు పాములు, మొసళ్లు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఇంట్లోకి వరద నీటితోపాటు మొసళ్ల కూడా వచ్చి చేరుతున్నాయి. ఇప్పటికి గుజరాత్ లోని పలు చోట్ల వర్షాలతో పాటు.. ఇంటి మీద, ఇళ్లలోకి భారీ మొసళ్లు కూడా వచ్చిచేరిపోయాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు...
గుజరాత్ లో భారీ వర్షం కురుస్తుంది. ఈ క్రమంలో జనజీవనమంతా అస్తవ్యస్తంగా మారిపోయింది. రోడ్డుమీద ఎక్కడ చూసిన కూడా మొసళ్లు కన్పిస్తున్నాయి. దీంతో జనాలు భయాందోళనకు గురౌతున్నారు. గుజరాత్‌లో ఎడతెరపి లేకుండా భారీ వర్షాల కారణంగా వివిధ ప్రాంతాల్లో వరద మయంగా మారిపోయింది. వడోదరాలో 10 నుంచి 12 అడుగుల మేర వరద నీరు నిలిచిపోయింది. పట్టణంలో అకోట స్టేడియం ప్రాంతంలోని ఓ ఇంటిపైకి మొసలి వచ్చి చేరింది.
అంతేకాకుండా.. కామత్ నగర్ ఫతే గంజ్ లో కూడా భారీ మొసలి ఏకంగా ఇంటిలోపలకి వచ్చి చేరింది. దీంతో స్థానికులు వెంటనే ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అంతేకాకుండా.. మొసళ్లను రెస్క్యూ చేశారు. అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు 30 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. అనేక గ్రామాలు పూర్తిగా నీటిలో మునిగిపోయినట్లు తెలుస్తోంది.
మొసళ్లు తరచుగా ఇళ్లలోనికి ప్రవేశిస్తుండటంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు చర్యలు తీసుకొవాలని కోరుతున్నారు. వరదల ప్రభావంలో ఉన్న గ్రామస్థులను అధికారులు ఇతర ప్రదేశాలకు షిఫ్ట్ చేసినట్లు తెలుస్తోంది. డిజాస్టర్ రెస్సాన్స్ ఫోర్స్ అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నారు. అంతేకాకుండా.. ప్రజలకు ఇబ్బందులు కల్గకుండా నిత్యవసార వస్తువులను కూడా స్వచ్చంద సంస్థల ద్వారా పంపిణి చేస్తున్నట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook