Mothers Day 2022: అమ్మతో మదర్స్ డే సెలబ్రేషన్స్.. అదో మరిచిపోలేని జ్ఞాపకం!
Mothers Day 2022: అమ్మంటే ప్రేమకు రూపం. జన్మజన్మాల బంధం. అమ్మ ప్రేమను మించి ఈ సృష్టిలో తీయనైంది మరొకటి ఉండదు. మాతృదినోత్సవం అంటే కేవలం ఒక్కరోజు సంబరం కాదు. బిడ్డ ఎదుగుదల కోసం ఎంతో కష్టపడ్డ అమ్మను ప్రతీరోజూ పూజించాలి. ఆజన్మాంతం రుణపడి ఉండాలి. మాతృదినోత్సవం సందర్భంగా దేశంలో ఉన్న అమ్మలందరికీ హ్యాపీ మదర్స్ డే.
Mothers Day 2022: అమ్మ.. ఈ సృష్టిలో ఇంతకు మించిన తియ్యని పదం మరొకటి ఉండదేమో. ప్రతి బిడ్డకు వాళ్ల అమ్మతో ఎంతో ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. ఒక మహిళ అమ్మగా పోషించే పాత్రలు అన్నీ ఇన్నీ కావు.. ప్రతి బిడ్డకు తన తల్లియే మొదటి ఫ్రెండ్, సంరక్షకురాలు, మెంటర్, ఇలా చెప్పుకుంటే పోతే అన్నీ అమ్మే. ఆ తర్వాతే ఏదైనా. చిన్నప్పుడు స్కూల్ నుంచి తీసుకురావడం నుంచి నచ్చిన వంటకాలు చేసి పెట్టడం వరకు అమ్మ తన బిడ్డపై చూపించే ప్రేమ వెలకట్టలేనిది. ఇంతలా తన బిడ్డ ఎదుగుదల కోసం కష్టపడ్డ అమ్మకు మదర్స్ డే శుభాకాంక్షలు చెప్పాల్సిందే.
మాతృదినోత్సవాన్ని సెలబ్రేషన్ చేసుకోవడం అంటే .. ప్రతి నిత్యం నీ కోసం కష్టపడ్డ ఆ మాతృమూర్తికి చిరకాలం గుర్తుండిపోయే జ్ఞాపకాలను అందించినట్టే. అందుకే మథర్స్ డే అంటే ఆ ఒక్క రోజు మాత్రమే జరుపుకునే సంబురం కాదు. ఈ సంవత్సరం ఇండియాలో ఆదివారం(మే8) న మాతృదినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మదర్స్ డే ప్రపంచవ్యాప్తంగా చూస్తే పలు రకాల తేదీల్లో జరుపుకుంటారు. అయితే ఎక్కువగా మార్చి లేదా మేలోనే ఈ వేడుకను నిర్వహిస్తాయి ప్రపంచదేశాలు. ప్రతి బిడ్డకు తన అమ్మతో ఉండే బంధం ఎంతో ప్రత్యేకమైనది. ప్రతి ఒక్కరికీ అమ్మతో మరిచిపోలేని ఎన్నో మధురజ్ఞాపకాలు ఉండే ఉంటాయి. ఆ ప్రాముఖ్యతను గుర్తిస్తే మాతృదినోత్సవాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు.
ఎప్పుడు ప్రారంభం:
1907వ సంవత్సరంలో అమెరికాలో మాతృదినోత్సవం సెలబ్రేట్ చేసుకోవడం ప్రారంభమైంది. వెస్ట్ వర్జీనియాలో అన్నా జర్విస్ అనే మహిళ తల్లి.. అన్నా రీవ్స్ జర్వీస్ 1905లో చనిపోయింది. ఆ సంవత్సరం నుంచే మదర్స్ డేని గుర్తింపు పొందిన సెలవుదినంగా జరుపుకోవాలని కోరింది. ఆ తర్వాత రెండు సంవత్సరాలకు 1907లో తొలిసారిగా మాతృదినోత్సవాన్ని జరుపుకున్నారు. అయితే ఇండియాలో మాతృదినోత్సవాన్ని కేవలం పట్టణ ప్రాంతాల్లోనే నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే రాను రానూ మాతృదినోత్సవాన్ని కూడా కమర్షియల్ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమ ప్రొడక్ట్స్ ను ఆకర్షించేందుకు మదర్స్ డేను కూడా కమర్షియల్ గా వాడుకుంటున్నారు.
Also Read: Mahindra Atom Price: దేశంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ వెహికల్ ను లాంఛ్ చేయనున్న మహీంద్రా!
Also Read: Girls Expenses: అమ్మాయిలు ఈ వస్తువుల కోసమే ఎక్కువ ఖర్చు చేస్తారట!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు Twitter , Facebook క్లిక్ చేయండి