Girls Expenses: అమ్మాయిలు ఈ వస్తువుల కోసమే ఎక్కువ ఖర్చు చేస్తారట!

Girls Expenses: యువతులు అందంగా, ఆకర్షణీయంగా కనిపించేందుకు ఇష్టపడుతుంటారు. వారు అందరికంటే స్పెషల్ గా కనిపించేందుకు సరికొత్త ట్రెండ్ ను అనుసరిస్తుంటారు. అయితే అమ్మాయిల్లో చాలా మంది ఎక్కువ డబ్బును 6 వస్తువుల కోసం ఖర్చు చేస్తారట. అవేంటో తెలుసుకుందాం.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 7, 2022, 05:01 PM IST
Girls Expenses: అమ్మాయిలు ఈ వస్తువుల కోసమే ఎక్కువ ఖర్చు చేస్తారట!

Girls Expenses: అబ్బాయిల కంటే అమ్మాయిల లైఫ్ స్టైల్ ఖరీదు ఎక్కువ అని చాలా మంది అంటుంటారు. అమ్మాయిలు అందంగా, ఆకర్షణీయంగా కనిపించడానికి ఇష్టపడతారు. వారు అందరికంటే మెరుగ్గా కనిపించేలా సరికొత్త ట్రెండ్‌లను అనుసరిస్తారు. అయితే యువతులు ఎక్కువగా ఖర్చు చేసే విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

షాపింగ్ అంటే ఇష్టం..

మీరు ఏదైనా షాపింగ్ మాల్ లేదా మార్కెట్‌కి వెళితే.. అమ్మాయిలు తమ స్టైల్‌లో రాజీ పడకూడదని వారు ఇష్టపడే వస్తువులను కొనడానికి చాలా సమయం వెచ్చిస్తారు. అన్నింటికంటే.. అమ్మాయిలు ఎక్కువగా ఖర్చు చేయడానికి ఇష్టపడుతారు. దాని వెనుక ఉన్న కారణం ఏంటో తెలుసా?

వీటి కోసమే అమ్మయిలు ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు..!

1. మేకప్ ఉత్పత్తులు

2. లేటెస్ట్ హ్యాండ్ బ్యాగ్‌లు

3. ఖరీదైన నగలు

4. ఫుడ్

5. దుస్తులు

6. చెప్పులు

ఈ వస్తువులు ఎందుకు ఖరీదైనవి?

ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తోంది. అమ్మాయిలు తమకు నచ్చే స్టైల్ ను ఇంటర్నెట్ ద్వారా గ్రహిస్తున్నారు. ఆ విధంగా మేకప్ అయ్యేందుకు అవసరమైన వాటిని కొనేస్తున్నారు. ఆ విధంగా వారు అందంగా ఆకర్షణీయంగా కనిపించి.. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను దక్కించుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. 
డబ్బు ఖర్చు చేయడానికి తెలివైన మార్గాలు

- ప్రతి నగరంలోనూ చాలా మార్కెట్‌లు ఉంటాయి. అక్కడ ఖరీదైన దుస్తులు, పాదరక్షలు సరసమైన ధరకే లభిస్తాయి. ఆ ప్రదేశాల్లో వాటిని కొనుగోలు చేయడం వల్ల ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం రాకపోవచ్చు. 

- మీరు బయటకు వెళ్లి రెస్టారెంట్‌లో ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకోవాలనుకుంటే.. ఆ బిల్లును కలిపి షేర్ చేసుకోవడం ఖర్చు తగ్గుతుంది. 

- మేకప్ కోసం ఎక్కువ డబ్బు వెచ్చించే బదులు, సింపుల్ లుక్ అడాప్ట్ చేసుకోవడం వల్ల మీరు నేచురల్ గా, అందంగా కనిపిస్తారు.

- అనేక పండుగలకు ఆన్‌లైన్ షాపింగ్‌ పై ఆఫర్‌లను కలిగి ఉంటాయి. మీరు పెద్ద మొత్తంలో దుస్తులు, నగలు మొదలైన వాటిని స్నేహితులతో కొనుగోలు చేస్తే, మీకు గొప్ప తగ్గింపు లభిస్తుంది. 

Also Read: Mothers Day 2022: మదర్స్ డే స్పెషల్ విషెస్.. ఈ రోజంతా అమ్మతోనే సరదాగా గడిపేద్దాం!

Also Read: Bath Mistake: అన్నం తిన్న తర్వాత తలస్నానం చేయొద్దు..ఆరోగ్యంపై అనేక ఎఫెక్ట్స్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x