Significance of Makar Sankranthi: కేవలం తెలుగు రాష్ట్రాలే కాదు దేశంలో చాలా రాష్ట్రాల్లో చాలా ఘనంగా జరుపుకునే పండుగలలో మకర సంక్రాంతి ఒకటి. మన దేశంలో హిందువులే కాదు విదేశాల్లో ఉండే మన హిందువులు కూడా సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ మకర సంక్రాంతి ఎందుకు చేసుకుంటారు? అనే విషయం మీద చాలా మందికి అవగాహన ఉండదు. వాస్తవానికి సూర్యుడి గమనాన్ని బట్టి ఈ పండుగ జరుపుకుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు అది సరిగ్గా జనవరి మాసంలోనే జరుగుతుంది, అందుకే ఎక్కువగా సంక్రాంతి ప్రత్యేక జనవరి 14 లేదా 15వ తేదీలలో వస్తుంది. సంక్రాంతిని కొన్ని చోట్ల ఉత్తరాయంగా కూడా పిలుస్తారు ఎందుకంటే మకర సంక్రాంతి రోజు నుంచి సూర్యుడు ఉత్తరం వైపు పయనిస్తాడని నమ్ముతారు. అంతేకాకుండా మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సరిగ్గా ఇదే సమయంలో దేశవ్యాప్తంగా పంటలు చేతికి వస్తాయి కాబట్టి ఆ పంటలు చేతికి అందుకొని ఘనంగా దేవుడిని ప్రార్థిస్తూ ఉంటారు.


అంతేకాక సంక్రాంతి ఒక్కరోజులో ముగిసిపోయే తంతు కాదు మూడు రోజుల పాటు మురిపెంగా చేసుకునే పండుగ. దీనిని తెలంగాణ ఆంధ్ర కర్ణాటకలో సంక్రాంతి అని తమిళనాడులో పొంగల్ అని మహారాష్ట్ర గుజరాత్ లో మకర సంక్రాంతి అని పంజాబ్ హర్యానాలో లోరి పిలుస్తారు. ఇక దేశంలో కొన్ని రాష్ట్రాలలో మాఘీ అని కూడా పిలుస్తారు. పేరు ఏదైనా సరే ఈ పండుగ మాత్రం అందరూ ఘనంగా జరుపుకుంటారు అని చెప్పక తప్పదు. పండుగ మూడు రోజులు చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు,


ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే అత్యంత ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. పగటి వేషాలు, డోలు సన్నాయి రాగాల మధ్య గంగిరెద్దుల నృత్యాలు, హరిదాసు కీర్తనలు, బుడబుక్కల వాళ్ళ కీర్తనలు ఇలా సంక్రాంతి అంటే ఒకటి కాదు వర్ణనకు అందనిది. కోళ్ల పందాలు, ఎడ్ల పందాలు అయితే మరికొన్ని ప్రాంతాల్లో మరింత సందడిగా చేస్తూ ఉంటారు. అదేవిధంగా పిండివంటలు కూడా పెద్ద ఎత్తున చేస్తూ ఉంటారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఏడాదిలో ఏ ఒక్క రోజు కూడా వాడని నల్ల నువ్వులను సంక్రాంతి రోజు మాత్రమే తిల తర్పణం పేరుతో పితృదేవతలకు సమర్పిస్తూ ఉంటారు.


ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సంక్రాంతి పండుగ దాదాపు ప్రతి సంవత్సరం జనవరి 14 న వస్తుంది. దానికి ప్రధాన కారణం ఏమిటంటే హిందువుల పండుగలు చాంద్రమానం ప్రకారం వస్తాయి కాబట్టి మనం అనుసరిస్తున్న క్యాలెండర్ ప్రకారం ఈ పండుగలు వేరువేరు తేదీల్లో వస్తాయి. కానీ సంక్రాంతి ఒక్కటే మాత్రం సౌరమానాన్ని అనుసరించి వస్తుంది కాబట్టి ఈ తేదీనే జరుపుకునే అవకాశం ఉంటుంది. చాలా అరుదైన సందర్భాలలో మాత్రమే 15వ తేదీని జరుపుకుంటాం అలా ఈసారి 15వ తేదీన జరుపుకుంటున్నాం అన్నమాట.


Also Read: AP Govt Focus: 'వీర సింహారెడ్డి'పై ఏపీ ప్రభుత్వం ఫోకస్.. స్పెసల్ షో చూసిన అధికారులు!


Also Read: Balakrishna Fans Arrested: వీర సింహా రెడ్డి థియేటర్ వద్ద అత్యుత్సాహం..10 మంది బాలయ్య ఫాన్స్ అరెస్ట్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook