AP Govt Focus: 'వీర సింహారెడ్డి'పై ఏపీ ప్రభుత్వం ఫోకస్.. స్పెసల్ షో చూసిన అధికారులు!

Andhra Pradesh Govt Focus : నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ డైలాగులు ఉండడంతో ప్రభుత్వం ఆ అంశం మీద ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే  

Written by - Chaganti Bhargav | Last Updated : Jan 13, 2023, 10:21 AM IST
AP Govt Focus: 'వీర సింహారెడ్డి'పై ఏపీ ప్రభుత్వం ఫోకస్.. స్పెసల్ షో చూసిన అధికారులు!

Andhra Pradesh Govt Focus on Veera Simha Reddy Movie: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వాన్ని నేరుగా టార్గెట్ చేసినట్లు గాని వైసీపీ నేతలను టార్గెట్ చేసినట్లు గాని అనిపించకపోయినా అభివృద్ధి గురించి నందమూరి బాలకృష్ణ చేత పలికించిన డైలాగులు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

అధికారంలో ఉన్న వారంతా వెధవలు అని అర్థం వచ్చేలా కూడా ఆయన వేసిన డైలాగులు తర్వాత సినిమాలో ఒక మినిస్టర్ పీఏ పేరు సాయి రెడ్డి అంటూ వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి పేరు గుర్తు వచ్చేలా పలికించడం కూడా ప్రభుత్వానికి ఏమాత్రం నచ్చలేదని అంటున్నారు. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉండడంతో విజయవాడలో గురువారం అర్ధరాత్రి అంటే నిన్న పొద్దుపోయిన తర్వాత కొందరు అధికారులు స్పెషల్ షో వేసుకుని సినిమా చూసినట్లు తెలుస్తోంది.

ఈ స్పెషల్ షో చూసిన తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ సినిమాలో డైలాగులు ఉన్నాయని నిర్ధారణకు వచ్చారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన డైలాగులను బేస్ చేసుకుని అధికారులు ఈ సినిమా చూసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇదే విషయాన్ని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లగా అసలు ఈ డైలాగులు ఎందుకు వాడారో తెలుసుకోవాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. వీర సింహారెడ్డి డైలాగులు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం మీద ఎలా ముందుకు వెళ్లాలి అనే విషయం మీద ఏపీ ప్రభుత్వం తర్జనభర్జనలు పడుతున్నట్లు తెలుస్తోంది.

బిట్లు బిట్లుగా ఉన్న వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో దీన్ని ఎలా అయినా కట్టడి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ సినిమాకి టికెట్ రేట్లు పెంచి అమ్ముకోవచ్చు అని కూడా ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది. వీర సింహారెడ్డి సినిమాకి 20 రూపాయలు మేరా టికెట్ రేటు పెంచి అనుకోవచ్చు అంటూ మైత్రి మూవీ మేకర్స్ సంస్థకు అనుమతులు ఇవ్వడంతో ప్రస్తుతానికి టికెట్ రేట్లు కూడా పెంచే అనుకుంటున్నారు. ఇంత చేసినా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ డైలాగులు ఉండడంతో కచ్చితంగా ఈ సినిమా మీద ఏదో ఒక చర్య తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమవుతుందనే సూచనలు కనిపిస్తున్నాయి. అసలు చూడాలి ఈ విషయంలో ఏం జరగబోతుంది అనేది. 
Also Read: Chiranjeevi Jarumitaya: చిరంజీవి నోట జంబలకిడి జారు మిఠాయా.. మంచు విష్ణు రియాక్షన్ ఏంటో?

Also Read: Waltair Veerayya Review: వాల్తేరు వీరయ్య మూవీ రివ్యూ.. పూనకాలు తెప్పించిన మెగా-మాస్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News