ఇప్పుుడందరి దృష్టి గూగుల్ ( Google ) సంస్థ పైనే పడింది. ఆ సంస్థ లాంచ్ చేయనున్న ప్రొడక్ట్ ( Google new product ) ఏంటనే విషయంపై ఆతృత నెలకొంది. ఇప్పటికే టీజర్ లాంటిది విడుదలవడంతో గూగుల్ ఏం లాంచ్ చేస్తుందా అంటూ ఎదురుచూస్తున్నారంతా.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఏదైనా వస్తువును మార్కెట్‌లో ప్రవేశపెట్టే ముందు ప్రకటనలివ్వడం, సినిమా విడుదలకు ముందు టీజర్లు, ఫస్ట్‌లుక్ ( Firstlook ) లు షేర్ చేయడం అందరికీ తెలిసిందే. అదే విధంగా  గూగుల్ ఇటీవల ఓ చిన్న టీజర్ లాంటి వీడియో విడుదల చేసింది. ప్రముఖ కమెడియన్ ఫ్రెడ్ ఆర్మిసెన్ యోగా భంగిమలో ఉన్న వీడియో ఇది. దీర్ఘ శ్వాస తీసుకుని సిద్ధంగా ఉండండి అంటూ గూగుల్ వ్యాఖ్యానం ఈ వీడియోకు జత అయింది. జూలై 13 న కొత్త ప్రొడక్ట్ లాంచ్ చేయబోతున్నట్టు గూగుల్ సంస్థ ( Google company ) ప్రకటించింది. ఈ నేపద్యంలో ఆ ప్రొడక్ట్ ఏంటి? ఎలా ఉంటుంది ? అనే విషయంపై గూగుల్ అభిమానులు, వినియోగదారులకు ఆసక్తి ఎక్కువైంది. గూగుల్ విడుదల చేయబోతున్న ఆ ప్రొడక్ట్ ఏంటనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. Also read: Google: భారత్‌లో 75వేల కోట్ల పెట్టుబడులు: సుందర్ పిచాయ్


గూగుల్ లాంచ్ చేయబోతున్న కొత్త ప్రొడక్ట్ నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్ హోమ్ స్పీకర్ ( next generation home smart speaker ) కావచ్చని ఎక్కువ శాతం అంచనా వేస్తున్నారు. ఎందుకంటే దీనికి జపాన్, యూఎస్‌లో ఇప్పటికే ఆ సంస్థ రెగ్యులేటరీ అనుమతుల్ని పొంది ఉంది. ఏదేమైనా మార్కెట్లో గూగుల్ టు బి లాంచింగ్ ప్రొడక్ట్‌పై చాలా అంచనాలున్నాయి. Also read: Indian Bullfrog: రంగులు మార్చే కప్పను చూశారా ?