Yellow colour Frogs: రంగులు మార్చే ఊసరవెల్లిని ( Chemeleon ) మీరు చూసి ఉండవచ్చు. కానీ రంగులు మార్చే కప్పను చూసి ఉండకపోవచ్చు. అయితే ఇలాంటి కప్పల ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా ( Social Media ) లో వైరల్ అవుతోంది. ఇందులో భారత దేశానికి చెందిన బుల్ ఫ్రాగ్ ( Indian Bull Frog ) అనే కప్పలు వర్షం నీటిలో సందడి చేయడాన్నీ మీరు చూడవచ్చు. అయితే భారత దేశంలో పసుపుపచ్చ రంగు కప్పలు ఎక్కువగా కనిపించవు.. మరి ఇలాంటి సమయంలో ముఖ్యంగా కరోనావైరస్ ( Coronavirus ) సమయంలో ఇలాంటి కప్పలు కనిపించడం వెనక ఉన్న ఆంతర్యం ఏంటి కోవిడ్-19 ( Covid-19 ) ఏవైనా సోకిందా అని నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. Also Read :WhatsApp Calling: గూగుల్ అసిస్టెంట్‌తో వాట్సాప్ కాల్ చేయోచ్చు తెలుసా ?
Have you ever seen Yellow frogs. Also in this number. They are Indian #bullfrog seen at Narsighpur. They change to yellow during monsoon & for attracting the females. Just look how they are enjoying rains. @DDNewslive pic.twitter.com/Z3Z31CmP0b
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) July 13, 2020
కొంత మంది ఈ కప్పలు ఆకాశం నుంచి జారిపడ్డాయి అని కూడా పుకార్లు వ్యాప్తి చేస్తున్నారు. వర్షాకాలంలో భారత దేశానికి చెందిన బుల్ ఫ్రాగ్ అనే జాతి కప్పలు..ఇలా రంగులు మార్చుతాయని… అలా చేయడం వల్ల అవి ఆడకప్పలను ఆకర్షిండానికి ప్రయత్నిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆడకప్పలను ఆకర్షించడానికి అవి ఖాకీ లేదా ఆలీవ్ రంగులోకి మారుతాయి అని... చెంపలను బెలూన్లలా ఊది.. అవి బ్లూ కలర్ వచ్చేవరకు ప్రయత్నిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ వీడియోను ప్రవీణ్ కాస్వాన్ అనే ఫారెస్ట్ సర్వీస్ అధికారి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.EMI REFUND : కట్ అయిన EMI తిరిగి రావాలంటే ఇలా చేయండి