Latest Viral Video: సోషల్ మీడియాలో నిత్యం బోలెడు వీడియోలు చక్కర్లు కొడుతుంటాయి. అందులో నవ్వించేవి, ఆసక్తి కలిగించేవి, ఉత్కంఠ రేపేవి.. ఇలా రకరకాల వీడియోలు దర్శనమిస్తుంటాయి. వీటిల్లో ఫన్ వీడియోలకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఫన్ వీడియోలను చాలా ఇష్టపడుతుంటారు. సరదాగా ఫన్ వీడియోలను వీక్షిస్తూ  కాసేపు నవ్వుల్లో మునిగి తేలుతుంటారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ ఫన్నీ వీడియో నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చెప్పులు చేతపట్టుకుని కాలువ దాటుతుండగా :


ఆ వీడియోను గమనిస్తే.. అందులో ఓ వ్యక్తి బురద మట్టిలో నిధానంగా ఒక్కో అడుగు వేస్తూ ముందుకు కదులుతాడు. కాస్త ముందుకు నడిచి కాలువ వద్దకు చేరుకోగానే.. కాళ్లకు ఉన్న స్లిప్పర్స్ తీసి చేతిలో పట్టుకుంటాడు. చెప్పులు వేసుకుని జంప్ చేస్తే ఎక్కడ జారిపడుతానోని.. ముందు జాగ్రత్తగా కాళ్లకు చెప్పులు తీసేశాడు. ఆ తర్వాత.. చిన్నగా ముందుకు దూకి కాలువ మధ్యలో మట్టి బెడ్డపై అడుగేయబోయాడు. అంతే.. అమాంతం అందులో మునిగిపోయాడు. అక్కడ మట్టి బెడ్డ ఉందని భావించాడు కానీ.. అలాంటిదేమీ లేకపోవడంతో ఒక్కసారిగా లోపలికి కూరుకుపోయాడు.



 


ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకూ ఈ వీడియోను (Viral Video) 1లక్షా 70 వేలమంది వీక్షించారు. ఈ ఫన్నీ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. 'గంగలో దూకాడు.. అన్ని పాపాలు కడిగివేయబడుతాయి...' అని ఓ నెటిజన్ ఫన్నీ కామెంట్ చేశాడు. 'ఉన్నట్టుండి మాయమైపోయాడు... గ్రేట్ మెజీషియన్..' అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.


Also Read: సినీ ఇండస్ట్రీలో విషాదం.. కేజీఎఫ్ హీరో యష్ ఫేవరెట్ డైరెక్టర్ కన్నుమూత..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook