Viral optical illusion: సోషల్ మీడియాలో ఈ మధ్య రకరకాల ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా కొన్ని పజిల్స్ (Picture Puzzles) లాగా ఉండే చిత్రాలు యూజర్స్ (Users)ను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఆ ఫోటోలో ఏముందో కనిపెట్టడానికి వీక్షకులు తలలు పట్టుకుంటున్నారు. దాన్ని తీక్షణంగా పరిశీలిస్తే తప్ప..అందులో ఏముందో గుర్తించలేం. ఇక ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు (optical illusion Imges) మెుత్తం మరో ఎత్తు. ఇలాంటి ఫోటోలు నెటిజన్లను ఇట్టే ఆకర్షిస్తాయి.  తాజాగా ఆ కోవకు చెందిన ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట (Social Media) వైరల్ గా మారింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఫోటోలో ఉండే గుర్రాల రంగు, మంచు పర్వతాల రంగు ఒకే విధంగా ఉన్నాయి. మనం ఈ చిత్రాన్ని శతవిధాలా ప్రయత్నిస్తే కానీ..ఎన్ని గుర్రాలు (Horses) ఉన్నాయో కనిపెట్టగలం. కాస్త తీక్షణంగా కళ్లకు పదును పెట్టి చూస్తేనే గానీ అవి కనబడవు. ఇది చూడటానికి సింపుల్ టాస్క్ గా కనిపిస్తోంది. కానీ చాలా మంది వీక్షకులు కేవలం ఐదు గుర్రాలు మాత్రమే గుర్తించగలిగారు. కానీ నిజానికి ఇందులో ఏడు గుర్రాలు ఉన్నాయి. ఈ చిత్రం యూఎస్ వెబ్‌సైట్ కిడ్స్ ఎన్విరాన్‌మెంట్ కిడ్స్ హెల్త్‌ (US website Kids Environment Kids Health) లో షేర్ చేయబడింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు కూడా అందులో ఏముందో కనిపెట్టండి మరి. లేట్ ఎందుకు ఓసారి ట్రై చేసి చూడండి. 


Also Read: Viral Photo: ఈ ఫోటోలోని జంతువును కనిపెట్టడం అంత ఈజీ కాదు గురూ..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి