How to List my home on Google Maps: ప్రస్తుతం గూగుల్‌ మ్యాప్స్‌ను ప్రజలు భారీగా వాడుతున్నారు. ఒకప్పుడు అడ్రస్ కనుక్కోవాలంటే వాళ్లను వీళ్లను అడుగుతూ గమ్యానికి చేరుకునేవాళ్లు. కానీ ప్రస్తుతం సింపుల్‌గా గూగుల్‌ మ్యాప్స్‌లో అడ్రెస్ ఎంటర్ చేసి.. లోకేషన్ సెట్ చేసుకుని ఈజీగా చేరిపోతున్నారు. ఇందులో మీరు నిర్వహిస్తున్న బిజినెస్‌ అడ్రస్ గానీ, మీ ఇంటిని గానీ ఎలా చేర్చాలో తెలుసా..? సింపుల్‌గా మీకు సంబంధించిన చిరునామాను గూగుల్ మ్యాప్స్‌లో యాడ్ చేసుకోవచ్చు. ఈ కింది స్టెప్స్ ఫాలో అయి మీ అడ్రస్‌ను మ్యాప్స్‌లో సెట్ చేసుకోండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Vijayawada: విజయవాడలో తీవ్ర కలకలం.. కలుషిత నీటికి ఇద్దరు బలి.. 100 మందికి వాంతులు, విరేచనాలు..


మొబైల్‌లో ఇలా..


==> ముందుగా గూగుల్ మ్యాప్స్‌ యాప్‌ను ఓపెన్ చేయండి.
==> సర్చ్ బార్‌పై క్లిక్ చేసి.. మీ ఇంటి అడ్రస్‌ను ఎంటర్ చేయండి.
==> అడ్రస్‌ను పూర్తిగా సరిపోయినప్పుడు.. స్క్రీన్ కింద హోమ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.
==> హోమ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి.. మీ హౌస్ అడ్రస్‌న చిరునామాను "హోమ్"గా సేవ్ చేయండి.
 
కంప్యూటర్‌లో ఇలా..


==> ముందుగా గూగుల్ మ్యాప్స్‌కి వెళ్లండి.
==> మీ హౌస్‌ అడ్రస్‌ను సర్చ్ చేయండి.
==> లెఫ్ట్ ప్యానెల్‌లో "మీ స్థలాలు" అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
==> హోమ్‌పై క్లిక్ చేసి.. మీ ఇంటి చిరునామాను "హోమ్"గా సేవ్ చేయండి.


లేబుల్ యాడ్ చేయండి..


==> మీ హోమ్ అడ్రస్‌పూ లేబుల్‌ను కూడా యాడ్ చేసుకోవచ్చు.
==> మీ ఇంటి ఫోటోలు, ఇతర వివరాలు యాడ్ చేయండి.
==> వర్క్ సింబల్, స్కూల్ సింబల్ వంటి లేబుల్ కూడా జోడించవచ్చు.


ఉపయోగం ఏంటి..?


మీ ఇంటి అడ్రస్‌ను గూగుల్‌లో యాడ్ చేసుకుంటే.. మీరు ఎక్కడికి వెళ్లినా సింపుల్‌గా హోమ్ బటన్ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా రూట్ మ్యాప్ వచ్చేస్తుంది. మీరు వెళ్లాలనుకునే ప్లేస్‌ల దూరాన్ని కూడా ఈజీగా కనుగొనవచ్చు. మీ ఇంటికి దగ్గరలో ఉన్న వ్యాపారాలు, రెస్టారెంట్లు, ఇతర ప్లేస్‌ల గురించి సమాచారం తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీరు ఎక్కడ ఉన్నా.. ఎవరికైనా మీ ఇంటి లోకేషన్ షేర్ చేయాలంటే హోమ్ బటన్‌పై క్లిక్ చేసి షేర్ చేయవచ్చు. 


Also Read: Lucknow: తాగడానికి ఒప్పుకోలేదని దారుణం.. టెర్రస్ పై నుంచి తోసేసిన మందు బాబులు.. వీడియో వైరల్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter