Aadhaar History: ఆధార్​ ప్రతీ భారతీయుడుకి.. అధికారిక గుర్తింపు. ప్రస్తుతం చాలా అవసరాలకు ఆధార్ తప్పనిసరి. సిమ్​ కార్డ్ తీసుకోవాలన్నా, రేషన్​ రావాలన్నా, పాస్​పోర్ట్ కావాలన్నా, బ్యాక్ ఖాతా తెరవాలన్నా.. ఇంకా ఎన్నో అవసరాలకు ఆధార్​ తప్పనిసరి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇలా ఎన్నో అవసరాలకు తప్పనిసరి అయిన కారణంగా ఆధార్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. అయితే చాలా మంది ఆధార్​ కార్డ్​లను అక్రమంగా వినియోగించుకుంటున్న సందర్భాు కూడా బయటపడ్డాయి. దీనితో ప్రతి ఒక్కరూ తమ ఆధార్ ఎక్కడ వినియోగమైందో తెలుసుకునేందుకు వీలు కల్పిస్తోంది ఆధార్​ కార్డులను పర్యేవేక్షించే 'యూనిక్ ఐడెంటిఫికేషన్​ అథార్టీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ)'.


మరి మీకూ మీ ఆధార్​ కార్డును ఎక్కడెక్కడ వాడారో తెలుసుకోవాలని ఉందా? అయితే అందుకో ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.


ఆధార్ హిస్టరీ తెలుసుకోవాలంటే..


  • ముందుగా uidai.gov.in వెబ్​సైట్లోకి లాగిన్ అవ్వాలి. ఇందులో హోం పేజీలోనే ఆధార్ సర్వీసెస్​ అనే ఆప్షన్​ను ఎంచుకోవాలి.

  • ఇక్కడ ఆధార్​ అథెంటికేషన్ హిస్టరీ అనే ఆప్షన్​పై క్లిక్ చేయాలి.

  • ఇక్కడ ఆధార్​ కార్డ్​ నెంబర్, క్యాప్చను ఎంటర్​ చేయాలి. అప్పుడి రిజిస్టర్​ మొబైల్ నంబర్​కో ఓ ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్​ చేయాలి.

  • అందులో అథేంటికేషన్ వివరాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కావాలో ఎంపిక చేసుకుని.. దానిని పీడీఎఫ్ రూపంలో డౌన్​లోడ్ చేసుకోవచ్చు.

  • ఆ హిస్టరీని చూడాలంటే పాస్​వర్డ్​ తప్పనిసరి. ఆ పాస్​వర్డ్ ఏమిటంటే.. మీ పేరులో మొదటి నాలుగు అక్షరాలు (ఇంగ్లీష్​), బర్త్ ఇయర్​ ఎంటర్ చేయాలి, ఎలాంటి స్పేస్​ ఎంటర్ చేయొద్దు.

  • దీనితో ఆ డాక్యుమెంట్ ఒపెన్ అవుతుంది. అందులో మీ ఆధార్​ నంబర్ ఎక్కడెక్కడ వాడారు. అనే వివరాలు ఉంటాయి. అందులో మీకు సంబంధించినది లేనట్లు అనిపిస్తే వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి.


Also read: Viral Video: కదులుతున్న ఆటో ట్రాలీ నుంచి చోరీ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..


Also read: Shocking Video: మద్యం మత్తులో కత్తితో పొడుచుకున్న యువకుడు.. చికిత్స పొందుతూ మృతి- వీడియో వైరల్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook