Shocking Video: మద్యం మత్తులో కత్తితో పొడుచుకున్న యువకుడు.. చికిత్స పొందుతూ మృతి- వీడియో వైరల్!

Shocking Video: మద్యం మత్తులో ఓ వ్యక్తి తనకు తాను కత్తితో గుండెపై పొడుచుకున్నాడు. హోలీ సందర్భంగా జరిగిన వేడుకల్లో పాల్లొన్న ఆ వ్యక్తి.. కత్తి పట్టుకొని చిందులేస్తూ, అనుకోకుండా కత్తితో పొడుచుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 19, 2022, 03:40 PM IST
Shocking Video: మద్యం మత్తులో కత్తితో పొడుచుకున్న యువకుడు.. చికిత్స పొందుతూ మృతి- వీడియో వైరల్!

Shocking Video: హోలీ సందర్భంగా కొందరు యువకులు సంబరాలు చేసుకుంటున్నారు. ఆ సంబరాల్లో పాల్గొన్న వారంతా మద్యం తాగి ఉన్నారు. ఆ యువకులంతా ఏదో పాటకు చిందులేస్తున్నారు. ఇదే సమయంలో ఓ వ్యక్తి తన చేతిలోని కత్తితో తనపై తానే దాడి చేసుకుంటాడు. ఆ తర్వాత రక్తం కళ్ల చూసి ఆశ్చర్యపోతాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. 

ఆ వీడియోలో ఏముందంటే?

శుక్రవారం హోలీ పండుగ సందర్భంగా కొందరు యువకులు ఓ చోట గుంపుగా సంబరాలు చేసుకుంటున్నారు. ఒంటిపై రంగులు చల్లుకొని ఉన్నారు. ఆ యువకులంతా మద్యం తాగినట్లు వీడియో ప్రకారం తెలుస్తోంది. తాగి.. ఏదో పాటకు ఆ యువకులు చిందులేస్తున్నారు. అందులోని ఓ యువకుడు చేతితో కత్తి పట్టుకొని డ్యాన్స్ చేస్తున్నాడు. అనుకోకుండా పాట మధ్యలో తన గుండెపై పొడుచుకుంటూ స్టెప్పులేశాడు. 

అయితే అది అతడు కావాలని చేసినట్లు లేదు. కానీ, మద్యం మత్తులో జరగరానిది జరిగిపోయింది. పొడిచిన సమయంలో గుర్తించని ఆ వ్యక్తి.. ఆ తర్వాత తన చొక్కాపై రక్తం చూసి అవాక్కయ్యాడు. ఆ తర్వాత వెంటనే అక్కడ నుంచి పారిపోయాడు. చికిత్స కోసం వెంటనే ఆ వ్యక్తిని అస్పత్రికి తరలించారు. అయితే ఆ యువకుడు కత్తితో బలంగా దాడి చేసుకోవడం వల్ల గుండెకు తీవ్ర గాయమైంది. ఆ తర్వాత అతడు చికిత్స పొందుతూ మరణించాడు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.  

Also Read: Shocking Video: ఈ రిక్షాకు దెయ్యం పట్టిందా? లేదా పెట్రోల్ బదులు మద్యం నింపారా?

Also Read: Leopard Hunting Video: కసిగా వేటాడిన చిరుతపులి.. వెంటనే పట్టుబడిన మొసలి.. వీడియో వైరల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News