PF Balance: ఈపీఎఫ్ఓ ఎప్పటికప్పుడు వినియోగదారులకు సరికొత్త సౌకర్యాలు కల్పిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకూ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలంటే యూఏఎన్ నెంబర్ కచ్చితంగా అవసరం. ఇప్పుడు ఈపీఎఫ్ కొత్త సౌకర్యాన్ని అందుబాటులో తీసుకొచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈపీఎఫ్ఓ (EPFO) వినియోగదారులు ఇప్పుడిక యూఏఎన్ నంబర్ లేకుండానే పీఎఫ్ లేదా ఈపీఎఫ్ డబ్బులను ( PF Balance Check) చెక్ చేసుకోనే విధంగా ఈపీఎఫ్ఓ సంస్థ కొన్ని మార్పులు చేసింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సభ్యులు ఇప్పుడు యూఏఎన్ నంబర్ (UAN Number) లేకుండానే పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. అది ఎలాగనేది ఇప్పుడు తెలుసుకుందాం..


ముందుగా ఈపీఎఫ్ఓ ​​హోమ్ పేజీ epfindia.gov.inలో లాగిన్ అవ్వాలి. అనంతరం క్లిక్ హియర్ టు నో యూవర్ పీఎఫ్ బ్యాలెన్స్‌పై క్లిక్ చేయాలి. ఆ తరువాత epfoservices.in.epfoపేజ్ ఓపెన్ అవుతుంది. తరువాత మీ రాష్ట్రం, ఈపీఎఫ్ సెంటర్, ఎస్టాబ్లిష్‍మెంట్ కోడ్, పీఎఫ్ అకౌంట్ నంబర్( EPF Account Number), మిగతా వివరాలను ఎంటర్ చేయాలి. వివరాల్ని ఎంటర్ చేసిన తరువాత ఐ అగ్రీ అనే బటన్‌పై క్లిక్ చేయాలి. వెంటనే మీ కంప్యూటర్ లేదా మొబైల్‌లో పీఎఫ్ బ్యాలెన్స్ చూపిస్తుంది.


యూఏఎన్ నెంబర్‌తో పీఎఫ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలి


ఒకవేళ మీకు యూఏఎన్ నెంబర్ ఉంటే మాత్రం మెస్సేజ్ ద్వారా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ వినియోగదారులకు యూఏఎన్ నంబర్ ఉంటే మెసేజ్ లేదా మిస్డ్ కాల్ సేవ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 7738299899కు EPFOHO UAN అనిటైప్ చైసి ఎస్ఎంఎస్ పంపాల్సి ఉంటుంది. వెంటనే మీ మొబైల్ స్క్రీన్‌పై పీఎఫ్ బ్యాలెన్స్ మెస్సేజ్ వస్తుంది. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 011-22901406 వద్ద మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా పీఎఫ్ లేదా ఈపీఎఫ్ బ్యాలెన్స్( EPF Balance) తెలుసుకోవచ్చు.


Also read: Pink Whatsapp: పింక్ వాట్సాప్ లింక్ క్లిక్ చేయవద్దు, మీ అకౌంట్ క్లోజ్ అవుతుంది తెలుసా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook