Electricity Bill: కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుందా..ఇలా చేస్తే చాలు
కరోనా టైమ్ నుంచి విద్యుత్ బిల్లులు జేబుకు చిల్లులు పెడుతున్నాయనే ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. ఇలా చేస్తే..మీ కరెంటును ఆదా చేసుకోవచ్చు. బిల్లుల్ని తగ్గించుకోవచ్చు. ఆ పద్ధతులు ఇవే…
కరోనా ( Corona ) టైమ్ నుంచి విద్యుత్ బిల్లులు జేబుకు చిల్లులు పెడుతున్నాయనే ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. ఇలా చేస్తే..మీ కరెంటును ఆదా చేసుకోవచ్చు. బిల్లుల్ని తగ్గించుకోవచ్చు. ఆ పద్ధతులు ఇవే…
ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లో కరెంటు బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని జనం ఆవేదన చెందుతున్నారు. అనవసర ఛార్జీల పేరుతో ప్రభుత్వం ( Government ) వసూలు చేస్తోందనే ఆరోపణలు ఎక్కువయ్యాయి. దీనికి పరిష్కారముంది. విద్యుత్ శాఖ ( Electricity department ) స్వయంగా కొన్ని చిట్కాలు పాటించమని చెబుతోంది. ఆ చిట్కాలు పాటిస్తే చాలు..మీ ఇంట్లో కరెెంటు బిల్లుల్ని తగ్గించుకోవచ్చు. కరెంటు ఆదా చేసుకోవచ్చు.
మన ఇళ్లలో ఉన్న విద్యుత్ ఉపకరణాలను సరైన పద్ధతిలో వాడితే జేబుకు చిల్లు పెట్టే కరెంటు బిల్లులను ( Electricity Bills ) కొంతవరకూ తగ్గించుకోవచ్చు. ప్రతిసారీ గత నెల కంటే ఎక్కువ బిల్లు వచ్చిందంటూ తలలు పట్టుకోవల్సిన అవసరం లేదిక. ఇలా చేస్తే మీ సమస్య తీరిపోతుంది. మన ఇంట్లో ఉన్న ఏసీ, రిఫ్రిజ్‌రేటర్, గీజర్, ఒవెన్ తదితర విద్యుత్ ఉపకరణాలను మనం ఎలా వాడుతున్నామనేది పరిశీలించుకోవాలి. ఎందుకంటే వాడకం పెరిగే కొద్దీ స్లాబ్ రేట్ ప్రకారం యూనిట్ ఛార్జీ అనేది ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే అయినా..ఎవరూ దీన్ని పట్టించుకోరు. బిల్లు చేతికి వచ్చినప్పుడు గగ్గోలు పెడుతుంటారు.
మీ ఇళ్లలో వాడే విద్యుత్ ఉపకరణాలే మీ విద్యుత్ మీటర్లను గిరగిరా తిప్పేస్తుంటాయి. వాటిని అదుపులో పెడితే చాలు..బిల్లు తగ్గిపోతుంది. ఎప్పుడూ యూనిట్ రేటు తక్కువగా ఉండే స్లాబ్ లో వినియోగం ఉండేలా చూసుకోవాలి.
గీజర్ల వినియోగంలో జాగ్రత్త
ఇంట్లో గీజర్ ( Geyser ) ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్కసారి ఆన్ చెయ్యకుండా.. కుటుంబ సభ్యులంతా ఒకరి తర్వాత మరొకరు స్నానాలు చేయడం అలవాటు చేసుకుంటే మంచిది. థెర్మోస్టాట్ 50–60 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండేలా చూసుకోవాలి. రెండు స్నానాల గదులుంటే ఒకటే గీజర్ నీటిని వాడుకునేలా ప్లంబింగ్ ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చేస్తే...నెలకు కనీసం 4 వందల వరకూ ఆదా చేసుకోవచ్చు.
ఏసీని అదుపు చేయడం ఇలా
ఏసీ ఎలా వాడాలనేది చాలామందికి తెలియదు. ముందుగా గదిలో చల్లదనాన్ని త్వరగా గ్రహించే వస్తువులైన ఐరన్, స్టీల్ వంటివి లేకుండా చూసుకోవాలి. గాలి బయటకు వెళ్లే అవకాశం లేకుండా చేస్తే.. గది త్వరగా చల్లబడుతుంది. చాలామంది త్వరగా కూల్ అవ్వాలనే ఆలోచనతో 18 డిగ్రీల టెంపరేచర్ సెట్ చేసుకుంటారు. అయితే ఎప్పుడూ 24 - 26 మధ్య ఉండేలా చూసుకుంటే చల్లదనంతో పాటు నెలకు బిల్లు 3 వందల వరకూ ఆదా అవుతుంది. Also read: ఇలా చేయకపోతే మీ Gmail ఎకౌంట్ Deactivate అవుతుంది!
పాత రిఫ్రిజిరేటర్ తో కష్టమే..
ఇంట్లో రిఫ్రిజిరేటర్ ఉంచే ప్రదేశానికి, గోడకు మధ్య వేడి తగ్గించేలా కొంత ఖాళీ ఉండేలా చూసుకోవాలి. గోడకు ఆన్చేయకూడదు. మరీ ముఖ్యంగా పాత ఫ్రిజ్ వాడుతుంటే నెలకు 160 యూనిట్ల వరకూ కాలుతుంది. స్మార్ట్ ఫ్రిజ్ అయితే ప్రయోజనముంటుంది. అవసరమైనప్పుడే అవి ఆన్ అవుతాయి. లేకపోతే ఆగిపోతాయి. దీనివల్ల మీ కరెంటు బిల్లు నెలకు 3 వందల వరకూ తగ్గిపోతుంది.
వాషింగ్ మెషీన్ వాడకం ఎలా
ఎప్పుడూ లోడ్ ఎంత ఉందో దాని ప్రకారం వాషింగ్ మెషీన్ లో బట్టలు వేసుకోవాలి. లోడ్ కు మించి వేస్తే..ఒత్తిడి పెరిగి వినియోగం పెరుగుతుంది. బట్టలన్నీ ఒకేసారి ఉతికేలా చూసుకోవాలి. అదేపనిగా వాడకూడదు. అన్నింటికీ మించి మిషన్ సరిగ్గా పని చేస్తుందా లేదా అనేది 3 నెలలకోసారైనా మెకానిక్ తో పరీక్షించుకోవాలి. ఇలా చేస్తే నెలకు 60 రూపాయలు ఆదా చేసుకోవచ్చు.
మైక్రో ఓవెన్ ఎలా వాడాలి
వంటకాన్ని బట్టి టైమ్ సెట్ చేసుకోవాలి. ఒకసారి ఆన్ చేశాక తరచూ తెరిచి చూడకూడదు. అలా చేస్తే టెంపరేచర్ పడిపోయి..మళ్లీ హీట్ అవడానికి ఎక్కువ టైమ్ తీసుకుంటుంది. ఈ జాగ్రత్తలు పాటిస్తే నెలకు ఓవెన్ ద్వారా 150 రూపాయల వరకూ ఆదా చేసుకోవచ్చు.
Also read: PUBG Indian Version: పబ్‌జి లవర్స్ కు గుడ్ న్యూస్! మళ్లీ ఎంట్రీ, అయితే చిన్న ఛేంజ్....