Whatsapp Deleted Messages: వాట్సప్‌లో ఏదైనా మెస్సేజ్ వచ్చి డిలీట్ అయిపోతే..ఏమై ఉంటుందనే ఆసక్తి ఉండటం సహజం. మీకు కూడా అదే ఆసక్తి, కుతూహలం వెంటాడుతుంటే..మీ సమస్యకు ఇదే మా పరిష్కారం. డిలీట్ మెస్సేజ్‌ను సులభంగా చదవవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాట్సప్ ఓ ప్రముఖ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది వినియోగిస్తున్న యాప్ ఇది. చాటింగ్‌తో పాటు ఆడియో, వీడియో కాల్స్ సాధారణంగా మారిపోయాయి. అటు వాట్సప్ కూడా యూజర్లను ఆకట్టుకునేందుకు, యూజర్ల సౌకర్యం కోసం కొత్త కొత్త ఫీచర్లు ప్రవేశపెడుతోంది. కానీ చాలా కొద్దిమందికి మాత్రమే వాట్సప్ ఫీచర్ల గురించి తెలుసు. ఓ చిన్న ట్రిక్ ద్వారా డిలీటెడ్ మెస్సేజ్ లేదా ఆడియా లేదా వీడియో ఎలా చూడాలో చూద్దాం.


అత్యంత సులభమైన వాట్సప్ ట్రిక్


ఎవరైనా మీకు ఓ మెస్సేజ్ లేదా వీడియో పంపి..కొద్ది సెకన్ల వ్యవధిలోనే డిలీట్ చేసేశారనుకోండి. ఆ మెస్సేజ్ లేదా వీడియో ఏమై ఉంటుందనే ఆసక్తి, కుతూహలం రావడం సహజం. ఇటువంటి పరిస్థితి మీకు ఎదురైతే మీరు చింతించాల్సిన అవసరం లేదు. కొన్ని ట్రిక్స్ ద్వారా అదేంటో తెలుసుకోవచ్చు.


వాట్సప్ డిలీట్ యాప్


ఈ ట్రిక్ వినియోగించాలంటే మీరు థర్డ్ పార్టీ యాప్ వినియోగించాల్సి ఉంటుంది. ముందుగా మీరు వాట్సప్ డిలీట్ యాప్ డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఆ తరువాత ఆ యాప్ క్లిక్ చేయాలి. ఆ తరువాత పర్మిషన్ యాక్సెస్ చేయాలి, అప్పుడే  ఈ యాప్ సరిగ్గా పనిచేస్తుంది. ఆ తరువాత మీరు వాట్సప్‌లో కూడా కొన్ని సెట్టింగ్స్ చేయాల్సి ఉంటుంది. వాట్సప్ ఓపెన్ చేసి మూడు డాట్స్‌పై క్లిక్ చేయాలి. సెట్టింగ్స్‌లో వెళ్లి..డేటా అండ్ స్టోరేజ్ యూసేజ్ క్లిక్ చేయాలి. మీడియా ఆటో డౌన్‌లోడ్‌కు వెళ్లి..అన్నింటిని అనుమతించాలి. ఇక అన్ని ఫైల్స్ ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అయిపోతాయి. ఆ తరువాత మెస్సేజ్, ఆడియా లేదా వీడియోలు రికవర్ అవుతాయి. అంతే..ఎవరైనా ఎప్పుడైనా మెస్సేజ్ లేదా వీడియో పంపి డిలీట్ చేస్తే..వెంటనే మీరు డౌన్‌లోడ్ చేసిన యాప్ ఓపెన్ చేయాలి. ఆ తరువాత మీకు డిలీట్ అయిన మెస్సేజ్, వీడియో లేదా ఆడియో కన్పిస్తాయి. కావాలంటే రికవర్ కూడా చేసుకోవచ్చు.


Also read: Noodles Pani Puri: పానీ పూరిని ఇలా కూడా తింటారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొత్త రెసిపీ!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook